కాజల్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. వరుస ఫ్లాపులు రావడంతో.. ఈ అమ్మడికి ఆఫర్స్ ఇచ్చేవారే కరువయ్యారు. దీంతో రెమ్యునరేషన్ తగ్గించేసింది. ఈ టైమ్ లో ఆచార్య మూవీలో చిరంజీవి పక్కన ఛాన్స్ రావడంతో.. ఎగిరిగంతేయాల్సింది పోయి.. రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందట. వచ్చిన బంపర్ ఆఫర్ తో కెరీర్ సరిదిద్దుకోకుండా.. ఎందుకిలా డిమాండ్ చేసింది. 

 

ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో హీరోయిన్స్ వేట స్టార్ట్ చేశాడు దర్శకుడు కొరటాల. ఖైదీ నెంబర్ 150 హిట్ కావడంతో.. చిరంజీవికి కలిసొచ్చిన కాజల్ ను సంప్రదిస్తే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది గానీ.. రెమ్యునరేషన్ దగ్గర బెట్టు చేస్తోందట. 

 

పారితోషికం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపించడం కాజల్ కు అలవాటే. రెమ్యునరేషన్ దగ్గర బెట్టు చేసి.. గతంలో ప్రస్టేజియస్ మూవీస్ పోగొట్టుకుంది. ఖైదీ నెంబర్ 150వ సినిమా కోసం సీనియర్ హీరోయిన్స్ అనుష్క, నయనతారను ట్రై చేసి కుదరకపోవడంతో.. ఆ ఆఫర్ కాజల్ దగ్గరకొచ్చింది. అప్పటి వరకు కోటి రూపాయిలు తీసుకునే.. చందమామ కోటిన్నర తీసుకుందని టాక్. కెరీర్ లో ఇప్పటి వరకు తీసుకున్న ఎమౌంట్ లో ఇదే పెద్దదట. 

 

ఆచార్య సినిమా నుంచి త్రిష తప్పుకోవడంతో నిర్మాత రామ్ చరణ్ కు 60లక్షలు నష్టం వచ్చిందని అంచనా. త్రిష రెమ్యునరేషన్ 80లక్షలు అయితే.. కాజల్ మాత్రం కోటి 40లక్షలు అడుగుతోందని టాక్. ఒకవేళ కాజల్ నే తీసుకుంటే.. హీరోయిన్ మారడం కారణంగా బడ్జెట్ లో 60లక్షలు పెరుగుతోంది. మరి ఇంత ఇచ్చి కాజల్ ను తీసుకుంటారో.. మరొకరిని ట్రై చేస్తారో చూడాలి. మొత్తానికి కాజల్ వచ్చిన బంపర్ ఆఫర్ గురించి ఆలోచించకుండా.. రెమ్యునరేషన్ విషయంలో బెట్టుగా ఉంది. కాజల్ ఫ్యాన్స్ కూడా ఆమెపై విమర్శలు ఎక్కుపెడుతున్నారట. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కానీ ఇలా చేయడమేంటని అనుకుంటున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: