మొన్నటివరకు చైనా దేశంలో ఎంతోమంది ప్రాణాలను బలితీసుకున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్ భారతదేశంలోకి కూడా వ్యాపించి ఎంతోమందిని ప్రాణ భయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారతదేశంలో కరోనా  వ్యాప్తి పెరిగిపోతూ ఉంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ఏకంగా దేశంలో 100 కరోనా  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా  అనుమానితుల సంఖ్య అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రభావం కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ తో  పాటు ఇటూ  తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా  పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. 

 

 

 ఇప్పటికే కరోనా  ప్రభావం ఎక్కువగా ఉన్న వివిధ రాష్ట్రాల్లో  రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో ఉన్న సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ విద్యాసంస్థలు బంద్  చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా తెలంగాణ సర్కారు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు.. సినిమా థియేటర్లు.. మూసి వేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా సినిమా షూటింగులు కూడా నిలిపివేయాలంటూ తెలిపింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లను మూసివేయాలని తెలంగాణ సర్కార్ ప్రకటించగా.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా  వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తాము కూడా మద్దతు ప్రకటిస్తామని... తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్.. మా అసోసియేషన్లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాయి. 

 

 

 ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలే కాదు ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు,  ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న  సినిమాలు  విడుదల ఎంతగానో లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ నెలకొంటుంది. అయితే తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎంతో నిరీక్షణ గా ఎదురు చూస్తున్నా అభిమానులందరికీ నిరాశ తప్పేలా లేదు. ప్రస్తుతం సినిమాల  చిత్రీకరణ కూడా ఆగిపోవడంతో... అభిమానులు మరింత  నిరాశ చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: