మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ సినిమాలు ఎందుకు రావడం లేదు, స్టార్ హీరోలు ఎందుకు వరుసగా సినిమాలు చేయడం లేదు అంటే ...అటు నుంచి వినిపించే సమాధానం రచయితల కొరత ఉందని. మరి తీసిన సినిమాలెందుకు డిజాస్టర్ అవుతున్నాయంటే మాత్రం దానికి సమాధానం రక రకాలుగా చెబుతుంటారు మన మేకర్స్. అలాగే  మన  ఫిలిం మేకర్స్ కి ఎందుకనో మన దగ్గర ఉన్న హీరోయిన్స్ పనికిరారు. ఇంకా చెప్పాలంటే తెలుగు అమ్మాయిలను ఎంతమాత్రం హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపించరు. ఎంతసేపటికి ఏ ముంబై నుండి మోడల్ నో  లేక ఢిల్లీ నుండి బ్యూటి నో తెచ్చుకుంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడకొచ్చి మాత్రం వేశాలేస్తుంటారు. అవే మన వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి.

 

ఇక బాలీవుడ్ హీరోయిన్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారన్న సంగతి తెలిసందే. టాలీవుడ్ లో ఉండేవారిలో ఎక్కువమంది నార్త్ నుంచి వచ్చినవాళ్ళు అయినప్పటికీ సౌత్ హీరోయిన్ల కిందే చూస్తారు. ఈ హీరోయిన్లకు మన దర్శక, నిర్మాతలు ఇచ్చే ప్రాధాన్యత వేరు.. పారితోషికం వేరు. అదే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చిన హీరోయిన్లకు ఇచ్చే గౌరవం.. రెమ్యూనరేషన్ కూడా నాలుగింతలుంటుందని మాట్లాడుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్స్ కి రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్ కం చెప్తారు. అందుకే మన తెలుగమ్మాయిలకి కాలిపోతుంటుంది. 

 

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శక ధీరుడి ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. క్రేజీ ప్రాజెక్టు లో బాలీవుడ్  హీరోయిన్ అలియా భట్ నటిస్తోంది. అలియాతో ఇంకా టాకీ పార్ట్ మొదలు పెట్టనప్పటి ఈవిడ అద్భుతమైన నటి అంటూ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెప్తున్నారట. 'సాహో' షూటింగ్ సమయంలో కూడా ఇలాగే శ్రద్ధా కపూర్ గురించి హైప్ ఇచ్చారు. కానీ శ్రద్ధా తెలుగు ప్రేక్షకులు చేతులెత్తి దణ్ణం పెట్టారు. అలాంటప్పుడు మనవాళ్ళు ఆలియాని ఎలా కౌగిలించుకొని మీరు సూపర్ యాక్ట్రెస్ అని అంటారు. ఇదే విషయం అనుభవం లో వచ్చిన శ్రద్ద కపూర్ అంటుదట. 

మరింత సమాచారం తెలుసుకోండి: