తమిళ సినిమా పరిశ్రమను ఏలేసిన హీరోగా రజినీకాంత్ పేరు ప్రఖ్యాతులు తెలీనివి కావు. తమిళ సినీ పరిశ్రమను అప్రతిహతంగా ఏలేసాడు రజినీకాంత్. సూపర్ స్టార్ గా రజినీ మ్యానియా తమిళనాట బ్రహ్మాండంగా కొనసాగింది. రజినీకాంత్ కూడా హీరో కాకముందు చేసినవన్నీ విలన్ పాత్రలే. తర్వాత ఆయన హీరోగా ఎదిగిపోయాడు. అయితే.. హీరోగా సమకాలీన విలన్లను ఎదుర్కొన్న రజినీకాంత్ తొంభైల్లో ఓ లేడీ విలన్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సినిమాలో లేడీ విలన్ పాత్రతో నువ్వా నేనా అని పోటీపడి ఆశ్చర్యపరిచాడు.

 

 

రజినీకాంత్ హీరోగా 1999లో వచ్చిన నరసింహ సినిమాలో విలన్ గా నటించిన రమ్యకృష్ణ ఎంత పేరు తెచ్చుకుందో తెలిసిన విషయమే. తమిళ్ లో పడయప్పా గా తెరకెక్కిన ఆ సినిమాకు కథ అందించింది తెలుగు రచయిత చిన్నికృష్ణ. సినిమాలో లేడీ విలన్ అనగానే రజినీకాంత్.. కథ విన్న తర్వాత ఏమాత్రం సంశయించలేదట. కానీ రమ్యకృష్ణ ఆ పాత్రను ఆ స్థాయిలో చేస్తుందని రజినీ ఊహించలేదట. సినిమా రసెష్ చూసిన రజికీ సినిమా పేరు పడయప్పా కాకుండా రమ్యకృష్ణ పాత్ర పేరయిన నీలాంబరి పేరునే టైటిల్ గా పట్టమన్నారట. కానీ రజినీ ఫ్యాన్స్ తో పెట్టుకోలేమని రజినీని ఒప్పించి పడయప్పాగా ఉంచారు. ఆ స్థాయిలో రమ్యకృష్ణ తన పాత్ర పోషించింది.

 

 

ప్రేమను సాధించుకోలేక పగతో రగిలిపోయే పాత్రను రమ్యకృష్ణ తన నటనతో ఓ స్థాయికి తీసుకెళ్లింది. తనకు దక్కనిది ఓ పనిమనిషికి దక్కడంపై తట్టుకోలేని కర్కశ పాత్రను అదే స్థాయిలో ప్రదర్శించింది. పగ సాధించలేక చివరకు తనకు తానే కాల్చుకుని చనిపోయే పాత్ర అది. లేడీ విలన్ గా రజినీతో సమానమైన లెంగ్త్ ఉన్న క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం.. రమ్యకృష్ణ పోషించిన విధానం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: