సినిమా పరిశ్రమలోకి ఒకసారి ప్రవేశించిన తరువాత చాలా వరకు ఇక్కడ మంచి వారు ఉండడంతో పాటు మంచి పనులే జరుగుతున్నప్పటికీ, అందరూ మంచి వారే అని అనుకోవడం పొరపాటని, అలానే మన కంటికి కపించేదంతా నిజం కాదని, అలాగని సినిమా ఇండస్ట్రీ వారందరూ చెడ్డవారు కాదని ఎప్పుడూ పలువురు ప్రముఖులు, విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఏ రంగంలో అయినా మంచితో పాటు చెడు కూడా తప్పనిసరిగా ఉంటుందని, అయితే మనకు తెలిసినది మనం చేసుకుంటూ, అవేవి పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగితే ఎటువంటి సమస్యలు రావు అనేది వారిచ్చే సలహా. 
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, మన సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మంచి పేరుతో దూసుకెళ్లిన బడా హీరోలు ఎందరో ఉన్నారు. వాస్తవానికి ఆ హీరోలపై అందరిలోను మంచి పేరు ఉంది. అయితే ఇటీవల ఒక సందర్భంలో ఒక స్టార్ నటుడి కూతురు, మరొక నిర్మాత కూతురితో కలిసి చేసిన ఒక పాడు పనిని బయటపెట్టాడో డాన్స్ మాస్టర్.

 

వాస్తవానికి ఆ డాన్స్ మాస్టర్ ఎప్పటినుండో టాలీవుడ్ లో కొనసాగుతూ పలు చిన్న సినిమాలతో పాటు అప్పట్లో కొన్ని పెద్ద సినిమాలకు కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సదరు డాన్స్ మాస్టర్ మాట్లాడుతూ, మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎక్కువగా మంచి వారే ఉన్నప్పటికీ, కొందరు మాత్రం పైకి కనపడేంత మంచి వారు కాదని, అది వారితో కలిసి పని చేసినప్పుడే తనకు తెలిసిందని ఆయన చెప్పడం జరిగింది. 

 

ఇక కొన్నేళ్ల క్రితం ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లిన తమకు, అక్కడ హఠాత్తుగా ఒక స్టార్ హీరో గారి కూతురు, మరొక బడా నిర్మాత కూతురితో కలిసి బహిరంగంగా మందుకొట్టడం చూసి తాను ఒక్కసారిగా పెద్ద షాక్ కు గురయ్యానని చెప్పారు. అయితే సదరు హీరో, అలానే ఆయన కూతురి పేరు కూడా బయటపెట్టిన డాన్స్ మాస్టర్, తనకు ఉన్న వాస్తవం మాట్లాడడానికి ఎటువంటి భయం లేదని చెప్పారు. కాగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని కొందరు కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం అది నిజం అయి ఉండవచ్చని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పలు మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: