టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో  దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి, ఫస్ట్ మూవీ తో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అక్కడి నుండి ప్రారంభం అయిన రాజమౌళి ప్రయాణం, ఆ తరువాత నుండి తాను చేస్తున్న ఒక్కో సినిమాతో సూపర్ హిట్ అందుకుంటూ ముందుకు సాగింది. అయితే మధ్యలో తనలోని డిఫరెంట్ టాలెంట్ ని బయటకు తీసి ఈగతో ఒక సినిమా తీసి దానితో కూడా అత్యద్భుత విజయాన్ని అందుకున్న రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు భాగాల సినిమాలతో టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఖ్యాతిని దేశ విదేశాల్లో కూడా మారుమ్రోగేలా వెలుగెత్తి చాటారు. ఇక ఆ తర్వాత నుండి రాజమౌళి పేరు కూడా విపరీతంగా మారుమ్రోగుతోంది. 

 

ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ హిస్టారికల్ ప్రాజక్ట్ ని తెరకెక్కిస్తున్న రాజమౌళి, దానితో మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇకపోతే ఆ సినిమా తరువాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తారు అనే దానిపై కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చర్చలు జరుగుతున్నాయి. అయితే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, రాజమౌళి తన తదుపరి సినిమాని ఒక చిన్న హీరోతో చేసేలా ప్లాన్స్ చేస్తున్నారట. ఇప్పటికే బాహుబలి రెండు సినిమాల తో పాటు, ఆర్ఆర్ఆర్ సినిమాతో కొంత మెంటల్ గా ఎంతో స్ట్రెయిన్ అయిన రాజమౌళి, ఆపై ఒక చిన్న సినిమా తీసి కొంత రిలాక్స్ అవ్వాలని భావిస్తున్నారట. 

 

అయితే ఆ సినిమా విషయమై అప్పుడే ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఒక మంచి కథను కూడా సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయ్యారని అంటున్నారు. వాస్తవానికి ఎప్పటినుండో సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నప్పటికీ, దానిపై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాకపోవడం, దానితో పాటు ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి చిన్న సినిమా చేయనున్నారు అనే వార్త ప్రచారం అవుతుండడం, ఒకింత సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని కలవరపెట్టే న్యూస్ అని, అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై పూర్తి వాస్తవాలు వెల్లడి అయితేనే కానీ నమ్మలేం అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: