ఆర్తి అగర్వాల్ అనే పేరు వినపడితే టక్కున గుర్తొచ్చేది ఇంద్ర సినిమాలోని స్నేహలతా రెడ్డి.ఒకప్పుడు టాప్ హీరోయిన్ లిస్ట్ లో ఉన్న హీరోయిన్ ఆర్తి. అందంతో, అభినయంతో అందరి మనసుల్ని ఆకర్షించింది. నవ్వితే చాలు నవరత్నాలు రాలతాయనట్లుగా ఉంటుంది.నవ్వితే బుగ్గన పడే డింపుల్ అగర్వాల్ ముఖానికి మరింత అందాన్ని ఇస్తుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవికె  చెమటలు పట్టించింది.. రియల్ గా కాదండోయ్ సినిమాలో. ఇంద్ర సినిమాలో చింరంజీవి పక్కన ఒక హీరోయిన్ గా నటించింది. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసి పాత్రకి న్యాయం చేసింది. ఇంద్ర సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే సీన్ లో స్నేహలతారెడ్డి గా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

 

 

స్నేహలతా రెడ్డి పాత్ర ఆర్తి కి బాగా పేరు తెచ్చింది. చిరంజీవిని ప్రేమించి మోసంచేశాడని అపార్థం చేసుకుని పగ సాధించాలని చూసే పాత్ర చేసింది. డైలాగ్ డెలివరీ కానీ, హావభావాలు కానీ, ముఖ కదలికలు గాని పెర్ఫెక్టుగా చేసింది. ఇంద్ర సినిమాలో ఆ పది నిముషాలు వచ్చే స్నేహలతా రెడ్డి సీన్స్సినిమాకి హైలెట్ గా నిలిచాయి.. 2002 జూలై 24న విడుద‌లైన `ఇంద్ర‌`దాదాపు 18 ఏళ్ళ‌ను పూర్తి చేసుకుంటున్న గాని సినిమాలోని ఆర్తి అగర్వాల్ పాత్ర ఈప్పటికి మరచిపోలేము. తర్వాత  హీరోయిన్ గా చాలా  సినిమాల్లో నటించింది. నువ్వు నాకు నచ్చావ్, ఇంద్ర,  పలనాటి బ్రహ్మ నాయుడు, ఛత్రపతి, అడవి రాముడు,  సోగ్గాడు, సంక్రాంతి, గోరింటాకు, నువ్వు లేక నేనులేను వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో ప్రముఖ హీరోల సరసన నటించారు.ఆర్తి అగర్వాల్  అండ్  తరుణ్ మీద కొన్ని  విమర్శలు కూడా వచ్చాయి. ఇద్దరు ప్రేమలో ఉన్నారని , అప్పట్లో కొన్ని వార్తలు దుమారం రేపాయి. తర్వాత అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టిపారేశారు. సినిమాలో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీనికి కారణం ఆర్తి లావుగా అవ్వడమే.బరువు పెరగడం వల్ల సినిమాలో ఛాన్సులు తగ్గిపోయాయి.  తర్వాత ఆమె ఉజ్వల్ అనే యన్.ఆర్.ఐ.ని పెళ్లిచేసుకుంది. కానీ జరిగిన  వివాహం విఫలం అయిన తరువాత ఆమె జీవితం ఒక ట్రాజడీ సినిమాలా మారిపోయింది. వివాహానికి ముందు వరకు ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలినప్పటికీ వివాహం విఫలమయిన తరువాత ఆమెను సినీ పరిశ్రమ పట్టించుకోలేదు.

 

 

దానితో ఆమె చిన్నచిన్నసినిమాలకే పరిమితమయింది. కానీ అవీ హిట్ అవకపోవడంతో ఆమెకు ఆ సినిమా అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అప్పటికే జీవితంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొన్న ఆమె దానితో మరింత క్రుంగిపోయింది. బహుశః ఆ కారణంగానే ఆమె బరువు కూడా పెరిగిపోయి ఉండవచ్చును. లైపో సక్షన్ సర్జరీ ద్వారా బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమె అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ సర్జరీ విఫలమయినందునే ఆమె మరణించి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ గుండెపోతూ కారణంగానే ఆమె మరనించినట్లు ఆమెమేనేజర్ తెలిపారు. ఏమయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఎంతగానో రంజింప జేసినా ఆర్తి అగర్వాల్ ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: