టాలీవుడ్ లో విలన్ గా చెరగని ముద్ర వేసుకున్న విలన్స్ లో రావు గోపాల్ రావు ఒకరు. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో అతను విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ తండ్రిగా అతని నటన ఎంతో ఆకట్టుకుంది. వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్, శోభన్ బాబు ఇలా ఎవరి పక్కన చూసినా సరే అతనే విలన్. చాలా సినిమాల్లో అతను వైవిధ్యం చూపించారు. ఒకే కోణంలో నటించే వారు కాదు. దీనితో అప్పటి స్టార్ హీరోలు అందరూ కూడా ఆయన్ను తమ విలన్ గా ఉండాలని కోరే వారట. ఆ విధంగా మెప్పించారు రావు గోపాల్ రావు. 

 

ముఖ్యంగా చిరంజీవి సినిమాల్లో ఆయన విలన్ గా మెప్పించారు. విలన్ అంటే ఎలా ఉండాలో అలా ఉండే వారు. క్రూరత్వం కూడా చూపించే వాడు. తన సినీ జీవితంలో ఎందరో హీరోలకు విలన్ గా నటించారు ఆయన. సూరీడు రకతం గక్కుతున్నట్టు లేడూ, సెగట్రీ, ఎదవలకు పదవులు ఇస్తే ఇలాగే ఉంటుంది అంటూ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నోటి నుంచి వచ్చిన డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన విలన్ గా ఆకట్టుకున్నారు. ఖైదీ, ఊరికి మొనగాడు, జస్టీస్ చౌదరి, కొండవీటి రాజా, కూలి నెంబర్ 1, 

 

సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తర్వాత ఆ విధంగా విలన్ గా మెప్పించిన నటుడు టాలీవుడ్ కి దొరకలేదు. అగ్ర హీరోల సినిమాలకు ఆయన ఉంటే ఒక స్థాయి ఉంటుంది అంటూ అప్పట్లో ప్రేక్షకులు వ్యాఖ్యానించే వారు. ఆయన విలన్ గా నటించిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినిమా సినిమాకు తన నటనలో వైవిధ్యం చూపించే వారు. పారితోషికం కూడా భారీగా తీసుకునే వారు. ఆయన డేట్స్ కోసం అప్పట్లో దర్శకులు ఎదురు చూసే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: