తెలంగాణ ప్రాంతంలో థియేటర్ల బంద్ ఈనెల 31 వరకు ఉండటంతో ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ  ఈ నెల 25న విడుదల కావాల్సిన మూడు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ లిస్టులో నాని ‘వి’ రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఉన్నప్పటికీ ఎవరు ఊహించని విధంగా రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ ఈ నెల 25న విడుదల అవుతుందా అంటూ సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. 


ఇలాంటి సందేహాలు రావడానికి ఒక ఆసక్తికర కారణం ఉంది. సినిమా థియేటర్లు మూసివేయాలని అని ఆదేశాలు ఇస్తూ జిహెచ్ఎమ్ సి ఇచ్చిన ఆదేశాలు ప్రకారం థియేటర్స్ బంద్ 21 వరకు మాత్రమే  అని అంటున్నారు. ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వస్తే ఈ నెల 22 నుండి థియేటర్స్ మళ్ళీ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. 


అదే జరిగితే ఉగాది పండుగ రోజు అయిన 25న సినిమాలు విడుదల కావడానికి అంతగా అడ్డంకులు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. అలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరు ఊహించని విధంగా ఉగాది పండుగరోజున రాజ్ తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ విడుదల అయినా ఆశ్చర్య పడనక్కర లేదు అని అంటున్నారు. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా ‘ఒరేయ్ బుజ్జిగా’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరగడమే కాకుండా ఈ ఫంక్షన్ కు అనేకమంది హాజరు కావడంతో పాటు ఈ సినిమా అంతా నవ్వులే నవ్వులు అంటూ రాజ్ తరుణ్ చెపుతూ ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలో ప్రకటిస్తాము అని చెప్పడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

 

చూడటానికి సినిమాలు లేక ఏకంగా వారం రోజులు అల్లాడిపోయిన ప్రేక్షకులు చిన్న సినిమానే అయినప్పటికీ పట్టించుకోకుండా రాజ్ తరుణ్ సినిమాను చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కు వచ్చే ఆస్కారం ఉంది. చివరి నిమిషంలో థియేటర్స్ రీ ఓపెనింగ్ విషయంలో క్లారిటీ వచ్చినా నాని  ఇలాంటి సాహసం చేయలేడు. కాని రాజ్ తరుణ్ చాలా సులువుగా సాహసం చేసే ఆస్కారం ఉంది. ఇప్పటికి వరస పరాజయాలతో తన మార్కెట్ అంతా కోల్పోయిన రాజ్ తరుణ్ కు రాబోతున్న ఉగాది నుంచి అయినా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: