ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించినవ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..


 

 

ఇప్పటికే కొందరు సినీ తారలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. 

 

 

 

ఇకపోతే కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. సినిమా రంగమైతే ఈ వైరస్ దాటికి కుప్పకూలింది. కరోనా హైరానా టాలీవుడ్ పై కూడా తీవ్రంగా పడింది. ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. నిన్న కేసీఆర్ ప్రభుత్వం థియేటర్లు మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటింకింది. తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడ్డంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇకపోతే ఈ నెలలో విడుదల కానున్న సినిమా లు వెనక్కి వెళ్లాయి. అది ఎప్పుడో చెప్పడం లేదు. ఇక సమ్మర్ కి రావాల్సిన సినిమాల షూటింగులు కూడా నిలిపేశారు. ‘ఆచార్య’ షూటింగ్ ఆపేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. 

 

 

 

చిన్న పెద్ద అనేది లేకుండా చాలా సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు అంతా గందరగోళంగా వుంది. సినిమా విడుదల వాయిదా పడటం మామూలు విషయమే. అయితే ఇలా మూకుమ్మడిగా సినిమాలు నిలిచిపోవడం చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇపుడు వాయిదా పడిన సినిమాలకు మళ్ళీ ఒక డేట్ కావాలి.ఎటు చూసిన కూడా నిర్మాతలపై పెనుభారం పడిందని చెప్పాలి. ఈ పరిస్థితి ఎంతవరకు కొనసాగుంతుందో చూడాలి మరి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: