సినిమాల్లో హీరోగా నటించడం సులభమెమో  కానీ విలన్ పాత్రలో నటించడం మాత్రం చాలా కష్టమే. ఎందుకంటే విలన్ పాత్రలో నటించాలని అంటే రౌద్రం గా ఉండాలి... తమ నటనతో ఏకంగా ప్రేక్షకులను సైతం భయపడే విధంగా ఉండాలి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది విలన్ పాత్రలకు తాము తప్ప ఇంకొకరు సెట్ కారేమో అనేంతగా  ప్రభావితం చేశారు. ముఖ్యంగా కొంతమంది ఎవరికీ సాధ్యం కానీ తనదైన డైలాగ్ డెలివరీతో విలనిజాన్ని పండించారు  ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇలా విలన్ పాత్రల్లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలన్ షియాజీ షిండే. షియాజీ షిండే ఏ సినిమాలో నటించినా తన పాత్రకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దానికి కారణం షియాజీ షిండే డైలాగ్ డెలివరీ. 

 

 

 ఎవరికీ సాధ్యం కానీ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో... షియాజీ షిండే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోల  సినిమాల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు షియాజీ షిండే. ఇక పవర్ఫుల్ విలనిజంతో తన డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కేవలం విలన్ పాత్రలే కాదు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో  తన నటన తో అదరగొట్టాడు. కొన్ని కొన్ని సినిమాల్లో కామెడీ విలన్ పాత్రలో కూడా నటించాడు. 

 

 

 అయితే షియాజీ షిండే విలన్ పాత్రలో పాతుకు పోవటానికి కారణం ఒక్కటే అని చెప్పాలి. అదే షియాజీ షిండే డైలాగ్ డెలివరీ. అప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ చూడని డైలాగ్ డెలివరీ షియాజీ షిండే  సొంతం. అందుకే షియాజీ షిండే తెలుగు చిత్ర పరిశ్రమకు విలన్ గా పరిచయమైన తరువాత... షియాజీ షిండే డైలాగ్ డెలివరీకి ఆయన స్లాంగ్  కి ప్రేక్షకులు అందరూ ఆకర్షితులు అయ్యారు అనే చెప్పాలి. అందుకే షియాజీ షిండే ఎన్నో రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. స్టార్ హీరోలను ఢీకొట్టే స్టార్ విలన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు షియాజీ షిండే.

మరింత సమాచారం తెలుసుకోండి: