టాలీవుడ్ లోకి అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ స్టార్ హీరో అవలేక ఇబ్బందులు పడుతున్నాడు గోపి చంద్. అతని కెరీర్ లో వచ్చిన హిట్ లు పెద్దగా చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేవు. ఒకటో రెండో సినిమాలు మినహా ఆయన రాణించిన సినిమాలు లేవు అనే చెప్పాలి. కాని విలన్ గా మాత్రం ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది వాస్తవం. అతను నిజం, వర్షం, జయం సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. ఆ సినిమాల్లో అతను తనలో ఉన్న ఎన్నో కోణాలు ప్రేక్షకులకు చూపించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అతను హీరోగా చేస్తున్నాడు. 

 

కాని విలన్ గానే అతనికి మంచి గుర్తింపు వచ్చింది అనేది వాస్తవం. ఈ మూడు సినిమాల్లో అతని కోణం చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. టాప్ విలన్ గా అతను రాణించాడు ఆ తర్వాత. ప్రస్తుతం అతను చేసే సినిమాలు ఏ ఒక్కటి కూడా కూడా సరైన హిట్స్ రావడం లేదు. దీనితో విలన్ గా చెయ్యాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. తమిళంలో విలన్ గా చేయడానికి ఆఫర్లు వచ్చినా సరే గోపి చంద్ వెనక్కు తగ్గాడు. ఇప్పుడు హీరోగా కంటే విలన్ గా చేయడానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నాడు అంటున్నారు. 

 

ప్రస్తుతం అతను చేసే రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత, విలన్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు. విలన్ గా అతనికి జూనియర్ ఎన్టీఆర్ పక్కన అవకాశం వస్తుంది అంటున్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా గోపి చంద్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అతను విలన్ గా చేస్తే మాత్రం కచ్చితంగా డిమాండ్ ఉంటుందని, టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వస్తుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: