అర‌వింద్ స్వామి అంటే గుర్తుకు వ‌చ్చేది ముందుగా మ‌న‌కి మ‌ణిర‌త్నం సినిమాలు. మ‌ణిర‌త్నం సినిమాల్లో హీరో అంటే ఒక‌ప్పుడు అర‌వింద్‌స్వామి క‌నిపించేవారు. హీరో అంటే ఇలా ఉండాలి అన్న‌ట్లు ఉండేవాడు అర‌వింద్‌స్వామి. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ద‌ళ‌ప‌తి` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన అర‌వింద్‌స్వామి త‌ర్వాత `రోజా`, `బొంబాయి` కొన్ని చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో నిలిచిపోయారు. బొంబాయి చిత్రంలో మ‌నిషాకొయిరాల‌తో క‌లిసి నటించిన చిత్రం ఆ చిత్రానికి అప్ప‌ట్లో సూప‌ర్ క్రేజ్ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇక కొన్ని చిత్రాల్లో న‌టించిన త‌ర్వాత చాలాకాలం సుధీర్ఘ గ్యాప్ త‌ర్వ‌త ఆయన రాంచ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ధృవ చిత్రంలో విల‌న్‌గా ఎంట్రీ అంద‌రూ అవాక్క‌య్యేలా చేశారు.

 

ఇక త‌మిళ చిత్రాల్లో ఎప్ప‌టికీ న‌టిస్త‌న్నా...తెలుగులో మాత్రం కొంత గ్యాప్ వ‌చ్చింది. ఇక రాంచ‌ర‌ణ్ మూవీ ధృవ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్‌కి ధీటుగా ఆయ‌న వేసే ఎత్తులు.. పోసాని కృష్ణ‌మూర‌ళి తండ్రి పాత్ర‌లో న‌టిస్తారు. వారిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే కొన్ని సీన్స్ అదిరిపోతాయి అని చెప్పాలి. మ‌రి హీరోగానే కాకుండా విల‌న్‌గా కూడా న‌టించి మెప్పించార‌ని చెప్పాలి. ఆ త‌ర్వాత ఆయ‌న న‌టించిన న‌వాబ్ చిత్రంలో కూడా ఇంచు మించు కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లోనే న‌టిస్తారు. అందులో విజ‌య్‌సేతుప‌తికి ధీటుగా ఆఖ‌రి క్లైమాక్స్ అదిరిపోత‌ద‌ని చెప్పాలి. అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వ‌చ్చే కొన్ని సీన్స్‌లో వాళ్ళ‌లో వాళ్ళే కాల్చుకుని చ‌నిపోయేలా చేసిన సీన్‌లో ఇటు అర‌వింద్‌స్వామి, అటు విజ‌య్ సేతుప‌తి పోటాపోటీగా న‌టిస్తారు. 

 

ప్ర‌స్తుతం ఆయ‌న లెజెండరీ త‌మిళ‌నాడు దివంగ‌త రాజ‌కీయ నాయ‌కుడు ఎం.జి.రామ‌చంద్ర‌న్(ఎంజీఆర్‌) పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. ఎల్‌.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్‌.సింగ్ నిర్మిస్తున్నారు. ఇటీవల కంగనా రనౌత్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన లభించింద‌ని చెప్పాలి. మ‌రి ఈ చిత్రంలో ఆయ‌న ఏ మాత్రం మెప్పిస్తారో తెర‌మీద చూడాలి. ఎంజీఆర్ పాత్రలోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేసిన‌ట్లు ఆయ‌న న‌టిస్తున్నార‌ని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ చిత్రానికి విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ, జీవీ ప్రకాష్ కుమార్ సంగీత మందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: