సుధీర్ పెళ్లి చేసుకున్నాడా..? రష్మీ వెంటపడి పడి విసిగిపోయిన సుధీర్ ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాడా అని డౌట్ పడొచ్చు. ఇక్కడ పెళ్లయింది సుడిగాలి సుధీర్ కి కాదు కొరియోగ్రాఫర్ సుధీర్ కు పెళ్లయింది. సీరియల్ యాక్ట్రెస్ అస్మితను పెళ్లాడాడు సుధీర్. బుల్లితెర మీద ఎన్నో సీరియల్స్ చేస్తున్న అస్మిత బాగా పాపులర్ అయ్యింది. స్టార్ మా లో వచ్చే అగ్నిసాక్షి సీరియల్ తో ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఆ సీరియల్ లో ఆమె భైరవి పాత్రలో చూపించే విలనిజం మాములుగా ఉండదు.

 

మాములుగా సీరియల్స్ లో లేడీ విలన్ పాత్రలు చేసేందుకు ఎవరు ఇష్టపడరు కానీ అస్మిత మాత్రం ఆ పాత్రలకు ఒకే చేస్తూ వస్తుంది. ఇన్నాళ్లు బ్యాచిలర్ గా ఉన్న అస్మిత కొరియోగ్రాఫర్ సుధీర్ ను ప్రేమించి పెళ్లాడింది. ఏడాది క్రితమే వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వారి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా స్టార్ మాలో వస్తున్న ఇస్మార్ట్ జోడీ షోలో అస్మిత జోడి అలరించింది. ఇస్మార్ట్ జోడీ మొదటి ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అవగా సెకండ్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను అలరిస్తుంది.

 

ఈ షోలో సుధీర్, అస్మితాల జంట పాల్గొంది. వీళ్ళే కాదు అగ్నిసాక్షి సీరియల్ లో హీరో హీరోయిన్ ఇద్దరు తమ జోడీలతో అలరించారు. ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో సీరియల్ స్టార్స్ రియల్ జోడీలు అలరిస్తున్నాయి. అగ్నిసాక్షి శంకర్ బాబు, గౌరీలు తమ రియల్ లైఫ్ పార్ట్ నర్స్ తో వచ్చి ఆడియెన్స్ ను సర్ ప్రయిజ్ చేశారు. సుధీర్ పెళ్లి అనగానే జబర్దస్త్ సుడిగాలి సుధీర్ అని అందరికి థాట్ వస్తుంది. ఇక్కడ జరిగింది అతని పెళ్లి కాదు మరి అతని పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: