ఒక‌ప్పుడు ఫ్యామిలీ ఆడియ‌న్స్ హీరో అంటే జ‌గ‌ప‌తిబాబు అనేవారు. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో మంచి కుటుంబ క‌థాచిత్రాల్లో న‌టించి మెప్పించారు. శోభ‌న్ బాబు త‌ర్వాత ఆ స్థాయి హీరో అంటే జ‌గ‌ప‌తిబాబు అనేవారు. ఇద్ద‌రు హీరోయిన్ల‌తో న‌టించ‌డం అంటే శోభ‌న్‌బాబు త‌ర్వాత ఎక్కువ‌గా అలాంటి పాత్ర‌ల్లో న‌టించేది జ‌గ‌ప‌తిబాబు మాత్ర‌మే. మ‌రి అంత అద్భుత‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోగా చాలా కాలం పాటు ఆయ‌న కొన‌సాగార‌ని చెప్పాలి. త‌ర్వాత త‌ర్వాత కొన్ని డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్‌లో న‌టించి మెప్పించారు. అంతఃపురం చిత్రంలో ఓ వెరైటీ క్యారెక్ట‌ర్‌లో న‌టించి కొత్త‌ద‌నాన్ని చూపించారు. ఆ త‌ర్వాత హీరోగానే కాదు విల‌న్ పాత్ర‌కి కూడా ఏమాత్రం త‌గ్గ‌ను అన్న‌ట్లుగా బాల‌కృష్ణ హీరోగా న‌టించిన లెజెండ్ చిత్రంతో విల‌న్‌గా ఎంట్రీ ఇచ్చి విల‌నిజాన్ని చూపించారు జ‌గ‌ప‌తిబాబు.

 

ఆ త‌ర్వాత శ్రీ‌మంతుడులో సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుకి ఓ మంచి ప్రౌడ్ ఫాద‌ర్ క్యారెక్ట‌ర్ నాగ‌చైత‌న్య చిత్రం రారండోయ్ వేడుక చూద్దాంలో నాగ‌చైత‌న్య తండ్రి పాత్ర‌ల్లో అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌ర‌న‌బ‌రిచారు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పాత్ర‌ల‌తో కొత్త‌ద‌నాన్ని తీసుకువ‌స్తూ ప్రేక్ష‌కుల‌కు ఎప్పుడూ ఒక కొత్త జ‌గ‌ప‌తిబాబుని ప‌రిచ‌యం చేస్తున్నారు. అయితే జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద్‌స‌మేత చిత్రంలో కొడుకుని సైతం చంపేంత కిరాత‌క‌మైన పాత్ర‌లో అద‌ర‌గొట్టార‌నే చెప్పాలి. విల‌న్ల‌లో కూడా ఇంత స్టైలిష్ విల‌న్లు ఉంటార‌న్న‌ది ఆయ‌నను చూసి నేర్చుకునేలా చేశారు జ‌గ‌ప‌తిబాబు. ఎన్టీఆర్‌తో ఆయ‌న రెండు సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించారు. ఒక‌టి`అర‌వింద్‌స‌మేత‌` రెండు `నాన్న‌కు ప్రేమ‌తో` చిత్రం.

 

అందులో మ‌ధుబాల భార్య‌గా క‌నిపిస్తుంది. ర‌కుల్‌ప్రీత్‌కి తండ్రి పాత్ర‌లో అద‌ర‌గొడ‌తారు.  ఆ చిత్రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ కి ధీటుగా ఏమాత్రం త‌గ్గ‌కుండా న‌ట‌న‌గాని, ఆయ‌న అందంగాని అస‌లు ఎక్క‌డా విల‌న్‌గా క‌నిపించ‌రు జ‌గ్గూభాయ్ అంత స్టైలిష్‌గా ఆ చిత్రంలో వ్య‌వ‌హ‌రిస్తారు. ఇటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా అటు విల‌న్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆయ‌న డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పిస్తున్నార‌నే చెప్పాలి. అలాగే ఇటీవ‌లె విడుద‌లైన చిరంజీవి `సైరా` చిత్రంలో కూడా చిరుని మోసం చేసిన పాత్ర‌లో త‌న‌కు తాను అందులో మ‌ర‌ణ శిక్ష విధించుకునే పాత్ర‌లో అద‌ర‌గొట్టార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: