రాజ‌మౌళి చిత్రంలో న‌టించ‌డం అంటే చాలు ఎవ్వ‌రైనా ఏ పాత్ర‌కైనా రెఢీ అంటారు. ఎందుకంటే ఆయ‌న టేకింగ్ అంత గొప్ప‌గా ఉంటుంది. ఆయ‌న చిత్రంలో న‌టించ‌డాన్ని చాలా గొప్ప‌గా అదృష్టంగా భావిస్తారు. ఆయ‌న ఏ పాత్ర‌నైనాస‌రే అంత అత్య‌ద్భుతంగా తెరకెక్కిస్తారు. ఇక రాజ‌మౌళి చిత్రంలో హీరోకి ఎంత ప్రాముఖ్య‌త ఉందో విల‌న్ల‌కి కూడా అంతే స‌మాన‌మైన ప్రాముఖ్య‌త ఉండేలా ఆయ‌న పాత్ర‌ల‌ను సృష్టిస్తారు. రాజ‌మౌళి చిత్రంలో హీరోగా న‌టిస్తే ఎంత పేరు వ‌స్తుందో విల‌న్‌గా న‌టించినా అంతే హైలెట్ అవుతారు. అందుకు కార‌ణం ఆయ‌న విల‌నిజాన్ని కూడా అంత అద్భుతంగా చూపించ‌గ‌ల‌రు. అలాంటి మంచి పాత్ర‌ల‌ను సృష్టిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ద‌నాన్ని నిరూపించుకుంటూ ఉంటారు ఆయ‌న చిత్రాల్లో. 

 

ఇక ఒక్కో చిత్రంలో ఒక్కో కొత్త‌త‌ర‌హాలో ఆయ‌న విల‌న్స్‌ని చూపిస్తూ ఉంటారు. ఆయ‌న చూపించే విధ‌నమే చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఈగ చిత్రంలో ఓ ఇద్ద‌రు మ‌నుషులు దెబ్బ‌లాడుకోవ‌డం అనేది చాలా స‌హ‌జ‌మైన విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రు ద‌ర్శ‌కులు చూపించిందే. రాజ‌మౌళి మాత్రం ఈ చిత్రంలో విల‌న్‌సుదీప్‌కి ఈగ‌తో ఫైటింగ్ పెడ‌తారు అది ఎంతో కొత్త‌గా చూసేవాళ్ళ‌కి ఉత్సాహంగా చాలా బాగా ఆ చిత్రంలో ఆసీన్ల‌ని చిత్రీక‌రించారు. అలాగే విక్ర‌మార్కుడు చిత్రంలో అజ‌య్‌ని ఆయ‌న చూపించే విధానం ఆ ఆకారం పిల్ల‌ల నుంచి పెద్ద‌లు వ‌ర‌కు అంద‌రూ భ‌య‌ప‌డే తీరులో ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కు అజ‌య్ అంటే ఎవ‌రికి పెద్ద‌గా తెలియ‌దుకానీ ఆ చిత్రంతో మంచి పేరు వ‌చ్చింద‌ని చెప్పాలి. ఇక బాహుబ‌లి చిత్రంలో విల‌న్‌కి ఒక ప్ర‌త్యేక కిలికి భాష‌ని కొత్త‌గా ప‌రిచ‌యం చేస్తూ ఆయ‌న రూపొందించిన కాల‌కేయ‌పాత్ర అత్య‌ద్భుతం అని చెప్పాలి. 

 

ఇక ఒక హీరోని కూడా విల‌న్‌గా చూపిస్తూ కొత్త త‌ర‌హాగా సృష్టించిన పాత్ర రాణా బాహుబ‌లి 2లో ఆయ‌న విల‌నిజం మాములుకాదని చెప్పాలి. ఒక విల‌న్‌గా ఆయ‌న రాణా విగ్ర‌హాన్ని ఎన్నో అడుగుల‌తో చేయించార‌ట‌. ఆ విగ్ర‌హాన్ని చూసుకుని రాణా రోజూ మురిసిపోయేవార‌ట‌. నా విగ్ర‌హం ఇంత పెద్ద‌దా అనుకుని ఒక్కోసారి షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌న స‌ర‌దాగా రాజ‌మౌళిని నేను ఈ విగ్ర‌హం ఇంటికి తీసుకువెళ‌తా అంటూ అడిగేవార‌ట‌. అది అంత గొప్ప‌గా చేయించార‌ట‌. ఇంక అందుకే ఆయ‌న చిత్రాల్లో విల‌న్స్ అంత‌గా హైలెట్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: