రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సీనియర్ నటుడు చలపతిరావు కొడుకే రవిబాబు. థ్రిల్లింగ్ సస్పెన్స్ సృజనాత్మకతతో ఆయన చిత్రాలను దర్శకత్వం వహిస్తారు. కథ కథనాలు ఎలా ఉన్నా రవిబాబు టేకింగ్ అంటే అమోఘమంటారు. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిబాబులో మరో కోణం కూడా ఉంది. అదేమిటంటే విలన్‌గా ఆయన తన తండ్రి చలపతిరావునే మించిపోయారు. శాడిస్ట్ పాత్రలో నటించాలంటే రవిబాబు తర్వాతే ఎవరైనా అన్నట్లు ఉంటుంది ఆయన నటన.
మావిడాకులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి. మురారి చిత్రం నుంచి మంచి పేరు వచ్చింది. తొలిసినిమాతోనే ప్రతినాయకుడిగా నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రముఖ హీరో అల్లరి నరేష్‌ని హీరోగా పరిచయంచేస్తూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రం `అల్లరి` ఈ సినిమా నరేష్ కి మంచి విజయం తీసుకువచ్చింది. ఆ తర్వాత తీసిన అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు చిత్రాలు కూడా చెప్పుకోతగ్గట్లే హిట్లు కొట్టాయి. ఇక ఆయన చిత్రాల్లో శాడిస్ట్ పాత్రలకి పెద్దపీట వేస్తారు. అందుకనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలంటేనే రవిబాబు అని చెప్పుకుంటారు. ఆ తర్వత ఆయన తీసిన అవును చిత్రం ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆయన ఒక శాటిస్ట్ పాత్రలో చాలా అద్భుతంగా నటించారు.
తన నటనకి చిన్న పిల్లలు శైతం భయపడేంతగా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇక కొన్ని పాత్రల్లో అయితే చలపతిని మించి నటిస్తూ ఉంటారు రవిబాబు. అనసూయ, నచ్చావులే చిత్రం కూడా తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచాయని చెప్పవచ్చు. ఓపక్క నటుడిగా మరో పక్క దర్శకత్వ విభాగంలో ఎంతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తున్నారు రవిబాబు. ఇక రవిబాబు సినిమాలకు ప్రమోషన్ కూడా చాలా డిఫరెంట్ వేలో ఇస్తుంటారు. నువ్విలా చిత్రంతో ఆయన తెలుగు తెరకు ఆరుమంది కొత్తవాళ్ళని పరిచయం చేశారు. అప్పట్లో ఇదొక కొత్త సంచలనంగా మారింది. ఇక ఈ చిత్రం కూడా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది.