సాధార‌ణంగా ఏ సినిమాకైనా హీరోనే ప్రాణం. ఆ హీరో గొప్పతనం బయటపడాలంటే.. అంతకంటే గొప్పవాడైన విల‌న్‌ కావాలి. అందుకోసం ఇటీవ‌ల హీరోలే.. విల‌న్స్‌గా మారుతున్నారు. నిజానికి తమిళ సినిమాలో మొదట నుంచి విలన్ల హవా కొనసాగుతూనే ఉంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సత్యరాజ్‌ వంటి స్టార్‌హీరోలు విలన్‌గా మెప్పించిన తరువాతే హీరోలుగా మారారు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. `ఈగ` చిత్రంలో విల‌న్‌గా ఆక‌ట్టుకున‌నాడు క‌న్న‌డ న‌టుడు సుదీప్‌. 

 

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ చిత్రం సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. జ‌క్క‌న్న‌ దర్శకత్వంతో పాటు ఈచిత్రంలో విలన్ రోల్ పోషించిన హీరో సుదీప్ కూడా మంచి మార్కులు కొట్టేశాడు. అప్పటి వరకు కర్నాటకకు మాత్రమే పరిమితం అయిన సుదీప్ స్టార్ ఇమేజ్... ఈగ చిత్రం పుణ్యమా అని సౌతిండియాలో పాపులారిటీ పెంచుకోవడమే కాదు... బాలీవుడ్ జనాలకు కూడా సుదీప్ టాలెంట్ ఏమిటో తెలిసిపోయింది. ముఖ్యంగా ఈగ చిత్రంతో హీరో న్యాచుర‌ల్ స్టార్‌ నాని రోల్ కంటే విల‌న్ రోలే హైలైట్‌గా క‌నిపిస్తుంది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 6, 2012 న విడుదలై భారీ విజయాన్ని సాధించిన విష‌యం తెలిసిందే.

 

అయితే ఈగ సినిమా దెబ్బ‌తో కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూనే ఇతర భాషల్లో విలన్‌గా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నాడు నటుడు సుదీప్‌. ఈగ సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఈ వర్సటైల్‌ యాక్టర్.. బాలీవుడ్ సినిమాల ప్రతినాయక పాత్రలో కూడా నటించాడు. అదేనండీ.. ప్రభుదేవా దర్శకత్వం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన `దబాంగ్ 3` మూవీ ద్వారా బాలీవుడ్ కు విలన్ గా సుదీప్ పరిచయ‌మై.. త‌న న‌ట‌న‌తో అక్క‌డ కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు. మ‌రియు తమిళంలోనూ విజయ్‌ హీరోగా వచ్చిన ‘పులి’ చిత్రంలో సుదీప్ న‌టించి మెప్పించాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: