ప్రజలను వణికిస్తున్న కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. సినిమా రంగమైతే ఈ వైరస్ దాటికి కుప్పకూలింది. కరోనా హైరానా టాలీవుడ్ పై కూడా తీవ్రంగా పడింది. ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. నిన్న కేసీఆర్ ప్రభుత్వం థియేటర్లు మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటింకింది. తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడ్డంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇకపోతే ఈ నెలలో విడుదల కానున్న సినిమా లు వెనక్కి వెళ్లాయి. అది ఎప్పుడో చెప్పడం లేదు. ఇక సమ్మర్ కి రావాల్సిన సినిమాల షూటింగులు కూడా నిలిపేశారు. ‘ఆచార్య’ షూటింగ్ ఆపేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. 

 

 

 

చిన్న పెద్ద అనేది లేకుండా చాలా సినిమాలు వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు అంతా గందరగోళంగా వుంది. సినిమా విడుదల వాయిదా పడటం మామూలు విషయమే. అయితే ఇలా మూకుమ్మడిగా సినిమాలు నిలిచిపోవడం చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇపుడు వాయిదా పడిన సినిమాలకు మళ్ళీ ఒక డేట్ కావాలి.ఎటు చూసిన కూడా నిర్మాతలపై పెనుభారం పడిందని చెప్పాలి. ఈ విధంగా సినిమాలను నిలిపివేసే ప్రక్రియ ఇంకెన్నాళ్ళు కొనసాగుతుంది అన్న విషయం క్లారిటీ రాలేదు...

 

 

ఈ మేరకు యువ కథానాయకుడు రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అరణ్య' .. ప్రభు సోలోమన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని హిందీలో ‘హాథీ మేరే సాథీ’, కన్నడలో ‘కాదన్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. కాగా, ఇటీవల విడుదల అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసింది..అడవిలోని జంతువులకు హాని కలగకుండా చూసుకుంటాడని టీజర్ను చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమాలో రానా అడవిని కాపాడే యువకుడుగా కనిపించనున్నారు.

 

 

 

సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తిచేసుకున్న  ఈ చిత్రం ఏప్రిల్ 2 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా వాయిదా పడనుందని చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. త్వరలోనే పూర్తివివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇలా చూసుకుంటే చాలా సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదని అర్థమవుతుంది... కరోనా ఎఫెక్ట్ మనుషులనే కాదు యావత్ దేశాన్ని కూడా కదిలించి వేస్తుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: