టాప్‌లీడ్‌లో ఉన్న హీరోయిన్‌ల‌లో పూజాహెగ్డే ఒక‌టి. ప్ర‌స్తుతం పూజా హ‌వా న‌డుస్తుంద‌ని చెప్పాలి. ఏ సినిమాలో చూసినా పూజానే క‌నిపిస్తోంది. ఎటు చూసినా త‌నే.ఇక ఈ భామ ఈ మ‌ధ్య గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో కుర్ర‌కారుని హీటెక్కిస్తుంది. ఇటీవ‌లె ఈ భామ అల‌వైకుంఠ‌పురంలో న‌టించి మెప్పించింది. ఇక ఈ అగ్ర‌క‌థానాయిక‌లు గ్లామరస్ పాత్రలేకాక డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఓరియంటెడ్ పాత్ర‌ల్లో కూడా న‌టించి మ‌ప్పిస్తున్నారు. అందులో ముందు వ‌రుస‌లో ఉన్న హీరోయిన్స్‌అనుష్క- నయనతార- సమంత- పాయల్ రాజ్‌పుత్‌ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారు. మిగిలిన హీరోయిన్లు ఇప్పుడిప్పుడే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీరి జాబితాలో గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే కూడా చేరబోతుంది. త్వరలో ఈ బుట్ట బొమ్మ కూడా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్టు స‌మాచారం.

 

ఇటీవల `అల వైకుంఠపురములో`తో  బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ బుట్టబొమ్మ ఇప్పుడు ప్రభాస్ సరసన జాన్ చిత్రంలో నటిస్తుంది. నిన్ననే షూటింగ్ కొర‌కు జార్జియాకి బ‌య‌లు దేరింది. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. దీంతోపాటు  ప్ర‌స్తుతం ఈ భామ అఖిల్ తో క‌లిసి`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్..లో అలాగే త్రివిక్రమ్- ఎన్టీఆర్ కాంబినేషన్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజాకి ఓ ప్ర‌త్యేక‌మైన పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ట‌. గ్లామరస్ పాత్రలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మకి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆఫర్ వచ్చిందట.

 

 దర్శకుడు హను రాఘవపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని రూపొందించేందుకు క‌థ‌ను రెడీ చేసుకుంటున్నాడ‌ట‌. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకునే ఆలోచనలో హను ఉన్న‌ట్లు స‌మాచారం. తన పాత్రకి ఆమె అయితేనే బాగా సూట్ అవుతుందని భావిస్తున్నారు.  పూజాని ఈ విషయంపై సంప్రదించగా.. తాను ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. అయితే అధికారికంగా పూర్తి క్లారిటీగా పూజా ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉందట. ఇదే నిజమైన తొలిసారి పూజాని ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో చూసే ఛాన్సుంది అభిమానులకు. మరి ఈ గ్లామర్ భామ అస‌లు అలాంటి పాత్ర‌ల‌కి సూట్ అవుద్దా అన్న అనుమానాలు కూడా మ‌రో ప‌క్క వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంకో ప‌క్క ఇక గ్ల‌మార్ పాత్ర‌ల్లో న‌టించ‌దేమో ఎక్స్‌పోజింగ్‌కి దూర‌మవుత‌దేమో అని టెన్ష‌న్ ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: