టాలీవుడ్ లో ఒక హీరో ఏదైనా చేసి అది విజయవంతం అయితే మిగిలిన హీరోలు కూడా దాదాపుగా అదే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా పారితోషికం విషయంలో ఒక హీరో ఎం చేస్తే మరో హీరో కూడా అదే చేస్తూ ఉంటారు. ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబు ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ఆ ట్రెండ్ ఏంటీ అంటే సినిమా విడుదలకు ముందు జరిగే మార్కెట్ మొత్తం తాను తీసుకునే ప్రయత్నం చేయడం. ఇది ఎంత వరకు ఫలించిందో తెలియదు గాని దీనిపై వార్తలు ఎక్కువగానే..

 

నెగటివ్ గా ప్రచారంలోకి వచ్చాయి. మహేష్ నిర్మాతలను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారని తన ఇష్టాలను నిర్మాతల మీద దర్శకుల మీద ఎక్కువగా రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు అని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా సరే మహేష్ మాత్రం ఆ విషయంలో వెనక్కు తగ్గలేదు. అయితే ఇది విజయవంతం అయింది అంటున్నారు కొందరు హీరోలు. దాని ద్వారా మహేష్ భారీగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని, అది నిర్మాతకు కూడా నష్టం లేని విధానం అని టాలీవుడ్ జనాల అభిప్రాయం గా కనపడుతుంది. అందుకే మహేష్ బాబు కూడా అదే ఫాలో అవుతున్నాడట. 

 

ఇప్పుడు దీనిని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్రివిక్రమ్ తో చేసే సినిమా విషయంలో అదే ఫార్ములా ని ఫాలో అవుతున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు విషయంలో నిర్మాతలు సీరియస్ గా ఉండటానికి ప్రధాన కారణం ఇదే అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. మరి నిర్మాతలను ఇబ్బంది పెట్టే విధానం జూనియర్ ఎన్టీఆర్ ఎంత వరకు ఫాలో అవుతాడు అనేది చూడాలి. ఇప్పటికే దీనిపై మహేష్ సలహాలను కూడా తీసుకున్నాడని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: