టాలీవుడ్ లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హవా నడుస్తుంది అనే మాట నిజం. ప్రస్తుతం అతను రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత అతను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. 

 

సినిమా విషయంలో అతను తప్పు చేస్తున్నాడని అంటుంది టాలీవుడ్. గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన హరీష్ శంకర్ తో వెంటనే రామయ్య వస్తావయ్య సినిమా చేసాడు తారక్. ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు రెండు వరుస హిట్ లు రాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఇలా హిట్ వచ్చిన దర్శకుల వెంట అతను పడుతున్నాడని, త్రివిక్రమ్సినిమా విషయంలో ఫెయిల్ అయితే మాత్రం జూనియర్ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కసరత్తులు ఎక్కువగా చేస్తున్నారు. 

 

త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ లుక్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. బాలీవుడ్ లో తనకు సన్నిహితంగా ఉండే దర్శకులతో కూడా అతను చర్చలు జరుపుతున్నాడు. త్వరలోనే ఈ లుక్ కి సంబంధించి ఒక అంచనాకు వచ్చి అప్పుడు విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ వేసే ఈ అడుగు అతనికి షాక్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది కొందరి మాట. ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది అంటున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: