తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన రమ్యకృష్ణ అప్పట్లో గ్లామర్ కి కేరాఫ్ అడ్రస్ అన్నారు.  ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఆప్పట్లో రజినీకాంత్ నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి గా ఆయనతో ఢీ అంటే ఢీ అనే విధంగా నటించి మెప్పించారు. అప్పటి నుంచి రమ్యకృష్ణ అత్త, అమ్మ పాత్రలో నటిస్తూ వస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన  బాహుబలి 2 లో ఆమె నెగిటీవ్ షేడ్స్ లో నటించారు. బాహుబలి'లో శివగామి పాత్రతో రమ్యకృష్ణ మరింత పేరు తెచ్చుకుంది. బాహుబలి తో జాతీయ స్థాయిలో ఆమెకు ఎంతో మంది గుర్తింపు వచ్చింది.  ప్రస్తుతం నెగిటీవ్ షేడ్స్ లో నటించి మెప్పించే స్థాయిలో సీరియన్ నటీమణులు ఎవరూ లేనట్టే అనిపిస్తుంది. 

 

కాకపోతే ఇటీవల కాలంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇలాంటి నెగిటీవ్ పాత్రలతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సాయితేజ్ - దేవకట్టా కాంబినేషన్లో రూపొందనున్న ఈ చిత్రంలో ఆమె ఈ తరహా పాత్రను పోషించనుంది. సాయితేజ్ - దేవ కట్టా కాంబినేషన్లో ఓ పొలిటికల్ డ్రామా నిర్మితం కానుంది.  పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ లో అలాంటి సిరియస్, కన్నింగ్, పొగరు బోతు లా కనిపించాలంటే ఆ పాత్రకు రమ్యకృష్ణనే సూట్ అవుతుందని భావించారట చిత్ర యూనిట్.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట.  ఒకప్పుడు నరసింహా లో నీలాంబరిగా ఎంత పవర్ ఫుల్ గా కనిపించిందో ఇప్పుడూ అలాగే చూపించబోతున్నారని టాక్. రమ్యకృష్ణ కెరీర్ లో శివగామి తరువాత రమ్యకృష్ణ చేసిన పాత్రలేవీ ఆ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అందుకే మరోసారి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు కనిపిస్తుంది రమ్యకృష్ణ. అయితే ఈ విషయం అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: