రష్మిక అందాల భామ. చలో అంటూ తనతో పాటు కుర్రకారునంతా ధియేటర్లలోకి తీసుకువెళ్ళి తన చుట్టే  తిప్పుకున్న నెరజాణ. గీతాగోవిందం బోధనలు యూత్ కి చేసి వారి రసిక హ్రుదయాల తలుపు తట్టిన విరిబోణి రష్మిక.

 

అటువంటి రష్మికకు లక్ బాగా కలసివస్తోంది. లేకపోతే డియర్ కామ్రెడ్ మూవీ ఫ్లాప్ అవగానే వెంటనే సరిలేరు నీకెవ్వరు మూవీ తగలడం. అది సూపర్ హిట్ కావడంతో 2020 ని ఫుల్ హ్యాపీస్ తో సెలెబ్రేట్ చేసుకుంది. ఆ తరువాత భీష్మతో మరో హిట్ కొట్టి తనదే 2020 అంటోంది. ఇపుడు అల్లు అర్జున్ మూవీలో జంట కట్టిన రష్మిక స్టార్ ఇమేజ్ కోసం ఈ మూవీని వాడేసుకోవాలనుకుంటోంది.

 

మరో వైపు జూనియర్ ఎన్టీయార్ మూవీలో హీరోయిన్ గా కూడా రష్మిక సెలెక్ట్ అయినట్లుగా న్యూస్ వస్తోంది. అయితే రష్మిక వచ్చిన పాత్రలను ఒప్పుకోకుండా జాగ్రత్తగా చూజ్ చేసుకుంటోందిట. తనకు గ్లామర్ తో పాటు కాస్తా గుర్తుండిపోయే రోల్స్ పడాలని గట్టిగా కోరుకుంటోందిట.

 

అదే కనుక జరిగితే తనకు తిరుగులేదని. మూడు పువ్వులు ఆరు కాయలుగా తన కెరీర్ ఉంటుందని రష్మిక భావిస్తోందిట. మరి ఎవరి సలహాలు తీసుకుంటుందో తెలియదు కానీ రష్మిక మిగిలిన హీరోయిన్ల కంటే కూడా బాగానే క్విక్  డెసిషన్లు తీసుకుంటోంది. పైగా తొందరగానే స్టార్ ఇమేజ్ సాధించేలా కనిపిస్తోంది.

 

అన్నిటికీ మించి రష్మిక ఉంటే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. అదే టైంలో సోషల్ మీడియా ద్వారా యూత్ కి దగ్గర అవుతూ హాట్ హాట్ పిక్స్ పెడుతోంది. ఇలా రష్మిక అన్ని విధాలుగా తన అందెంతో పందెం కాస్తూ మిగిలిన హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. మరి రష్మిక కరెక్ట్ ట్రాక్ లోనే నడుస్తోంది. ఆమెకు మరో రెండు హిట్లు పడితే టాలీవుడ్లో టాప్ ప్లేస్ ఆమెదేనని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: