సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎందరో ప్రయత్నిస్తూంటారు. టెక్నికల్ విభాగంలో కూడా తమ సత్తా చాటుకునేందుకు ఎందరో ఔత్సాహికులు తమ టాలెంట్ ను పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరుగుతూంటారు. ఒక్క అవకాశం వచ్చినా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూంటారు. ఏళ్ల తరబడి అసిస్టెంట్లుగా కూడా పనిచేస్తారు. అలా ఏళ్లుగా కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా మాటల రచయితగా పనిచేసిన ఓ రైటర్ కు అవమానం జరిగింది. ఏ విభాగంలో నువ్వు రాణించలేవని  మాటలు పడ్డాడో అందులో సక్సెస్ అయి సత్తా చాటాడు. ఆ వ్యక్తే అనిల్ రావిపూడి.

 

 

అనిల్ రావిపూడి అసిస్టెంట్ రైటర్ గా ఎన్నో సినిమాలకు పనిచేశాడు. ఆగడు సినిమాకు ఫస్టాఫ్ మాటలు కూడా రాశానని తానే చెప్పాడు. కొన్ని సినిమా టైటిల్స్ లో అనిల్ రావిపూడి పేరు కూడా ఉంటుంది. 2009లో గోపీచంద్ హీరోగా వచ్చిన శంఖం సినిమాకు అనిల్ మాటలు, స్క్రీన్ ప్లే కూడా రాశాడు. ఆ సినిమా షూటింగ్ సందర్భంలో తనకు జరిగిన అవమానాన్ని ఇటివల ఓ టీవీ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో ఉండగా సీన్ కోసం అక్కడే టెంట్ లో ఉన్న ఇద్దరు ఆర్టిస్టులను పిలవటానికి వెళ్లాడట. నువ్వెవరు అని అడిగిన ఆ ఇద్దరు ఆర్టిస్టులకు.. నేను ఈ సినిమా రైటర్ ని అని చెప్పాడట. ‘పెన్ను, పేపర్ పట్టుకున్న ప్రతివాడూ రైటర్ అయిపోదామనే.. దర్శకుడు అయిపోదామనే’ అని తిట్టుకున్నారట.

 

 

ఆరోజు చాలా బాధ పడినట్టు చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. కానీ తన పని తాను చేసినట్టు వివరించాడు. ఇండస్ట్రీలో ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని.. ఎవరి టాలెంట్ ఎప్పుడు బయటపడుతుందో.. ఎవరి అదృష్టం ఎప్పుడు కలిసొస్తుందో చెప్పలేమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనిల్ దర్శకుడిగా వరుస హిట్లు ఇస్తూ రాణిస్తున్నాడు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: