శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య హీరోగా సాయిప‌ల్లవి హీరోయిన్‌గా న‌టిస్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఇక శేఖ‌ర్ కమ్ముల చిత్రాల‌కు ఒక ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంటుంది. ఆయ‌న చిత్రాలంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ‌గా ఉంటుంది. అందులోనూ రొమాంటిక్ చిత్రాల్లో న‌టించ‌డంలో చైతూ సూప‌ర్ అని చెప్పాలి. ఎంతైన మ‌న్మ‌ధుడు కొడుకు క‌దా ఆ మాత్రం ఉంటుందిలే అంటున్నారు కొంద‌రు సినీ పెద్ద‌లు. ఈ క్రేజీ సినిమా పై భారీ అంచనాలతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలోని మొదటి పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. "హే పిల్లా" అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

 

ఇక ఈ చిత్రం నాగ‌చైత‌న్య కెరియ‌ర్‌కి ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డుతుందో వేచి చూడాలి. ఈ మ‌ధ్య కాలంలో చైతూ న‌టించిన చిత్రాల‌న్నీ దాదాపుగా హిట్‌బాట‌లోనే న‌డుస్తున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం, శైల‌జారెడ్డి అల్లుడు, మ‌జిలీ ఇవ‌న్నీ హిట్ చిత్రాలుగానే నిలిచాయి. ఇక శేఖ‌ర్‌క‌మ్ముల చిత్రం కూడా దాదాపు హిట్ ప‌డితే కొంత వ‌ర‌కు ఆయ‌న కెరియ‌ర్ గాడిలో ప‌డిన‌ట్టే. మ‌రి ఈ ల‌వ్‌స్టోరి గ‌నుక హిట్ అయితే ఇటు శేఖ‌ర్‌క‌మ్ముల‌కి, అటు నాగ‌చైత‌న్య‌కి ఇద్ద‌రికీ వ‌ర్క్ అవుట్ అవుతుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ సాయిపల్లవితో నాగ‌చైత‌న్య డాన్స్ అంతగా కుద‌ర‌లేద‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆమె అద్భుతమైన నటనతో పాటు డాన్స్ కూడా ఇరగదీస్తోంది. 

 

ఈ సినిమాలోని పాటలకు సాయిపల్లవితో నాగచైతన్య డాన్స్ చేయలేకపోతున్నాడట. ఆమెతో స్టెప్స్ సీక్వెన్స్ లో వేయడానికి నాగచైతన్య 10-20 టేకులు తీసుకుంటున్నట్లు సమాచారం. సాయిప‌ల్ల‌వి డాన్స్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. "ఫిదా" తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: