టాలీవుడ్, కోలీవుడ్ లో తమిళ్ హీరో విజయ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇటీవల విజయ్ నటించిన అదిరింది, సర్కార్, విజిల్ ఇలా వరుస విజయాలు అందుకుంటూ వచ్చాయి.  ప్రతిసినిమా ఏదో ఒక కాంట్రవర్సీతో మొదలైనా చివరికి బాక్సాఫీస్ హిట్ గా నిలిచాయి.  తాజాగా తన స్నేహితుడు అజిత్‌ని ఓ విషయంలో తాను ఫాలో అయ్యానని అన్నారు కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌.  విజయ్ నటించిన సినిమాలు మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తన సినిమాలు కూడా తెలుగు లో రిలీజ్ అయ్యేలా చూస్తున్నట్లు తెలిపారు. 

 

ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మూవీ 'మాస్టర్‌'. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆడియో విడుదల వేడుక   చెన్నైలో జరిగింది.    కరోనా వైరస్‌ కారణంగా అతి తక్కువ మందితో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌లా దీనిని నిర్వహించారు.  ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ఈ మూవీలో నటించిన విలన్ విజయ్‌ సేతుపతి గురించి ఎన్నో సంచలన విషయాలు తెలిపారు.  విజయ్‌ సేతుపతి ప్రస్తుతం చాలా కీలకమైన వ్యక్తిగా మారారు. మనం ఇప్పటి వరకూ చాలా నెగిటివ్‌ పాత్రలను చూశాం. కానీ, మాస్టర్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. 

 

ప్రస్తుతం విజయ్ సేతుపతి వివిధ భాషల్లో నటించి మెప్పిస్తున్నారు.  ఈ మూవీలో ఆయన పాత్రను చూస్తే ఆడియన్స్ మెచ్చుకుంటారు.  అయితే ఓ రోజు షూటింగ్ లో నేను విజయ్ సేతుపతి ని కలిసి ఈ మూవీలో విలన్ గా నటించాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు. అప్పుడు నవ్వుతూ.. ఐ రియల్లీ లైక్‌ యూ అనే నాలుగు పదాలు చెప్పి నా నోరు మూయించాడు' అని విజయ్‌ అన్నారు. ఆడియో వేడుకలో భాగంగా విజయ్‌ మాస్టర్‌ సినిమా దర్శకుడు లోకేశ్‌ కనకరాజును మెచ్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: