విజయ్ దేవరకొండను స్టార్ చేసిన సినిమా అర్జున్ రెడ్డి. పెళ్లిచూపులు సినిమాతో ఒక మోస్తారుగా గుర్తింపు తెచ్చుకున్న అతనికి అర్జున్ రెడ్డి హిట్ కెరియర్ లో మంచి జోష్ తెచ్చింది. ఆ తర్వాత వెంటనే గీతా గోవిందం సినిమా సెన్సేషనల్ హిట్ అవగానే మనోడికి స్టార్ ఇమేజ్ వచ్చింది. అర్జున్ రెడ్డి సినిమాతోనే విజయ్ కు యూత్ ఆడియెన్స్ లో బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటన చూసి అందరు అవాక్కయ్యారు. 

 

అల్లు అర్జున్ అయితే అర్జున్ రెడ్డి సినిమా చూసి వారం రోజులు బయటకు రాలేదని సభాముఖంగానే చెప్పాడు. అయితే రీసెంట్ గా వచ్చిన ఆలా వైకుంఠపురములో సినిమాలో అర్జున్ రెడ్డిని వాడేశాడు బన్నీ. అదేంటీ సినిమాలో అర్జున్ రెడ్డిని వాడటం ఏంటి.. అలాంటి సీన్లు ఏవి లేదుగా అయినా త్రివిక్రమ్ సినిమాలో అర్జున్ రెడ్డి సీన్స్ అసలు ఊహించగలమా.. అయితే అలాంటి వారికి షాక్ ఇస్తూ అర్జున్ రెడ్డి సినిమా సీన్ లో సుశాంత్ ను చూపించాడు త్రివిక్రం. అల వైకుంఠపురములో సినిమాలో డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు. ఈ సీన్ లో అల్లు అర్జున్ సుశాంత్ ను ఆహారపు అలవాట్లు, డ్రింకింగ్ లాంటివాటి గురించి కూపీ లాగుతాడు. కానీ మనోడు అవేమి అలవాట్లు లేవన్నట్టు అమాయకంగా చెబుతాడు. 

 

అప్పుడు అల్లు అర్జున్ సుశాంత్ మందు కొట్టడం కెమెరాతో షూట్ చేసి చూపిస్తాడు. అది చూసిన సుశాంత్ ఇప్పుడు ఏం చేయాలి అంటాడు. సినిమా నిడివి ఎక్కువవడం వాళ్ళ ఈ సీన్ తొలగించారు కానీ అర్జున్ రెడ్డి 2 అంటూ బన్నీని చెప్పిన డైలాగ్ థియేటర్ లో బాగా పేలేది. మొత్తానికి హిట్టు సినిమా డిలీటెడ్ సీన్స్ కూడా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కొనసాగిస్తూ అల డిలీట్ అయిన సీన్స్ అదరగొడుతున్నాయి. ఇక ఈ డిలీటెడ్ సీన్ చూసిన వారు బన్నీ సపోర్ట్ తో అర్జున్ రెడ్డి 2లో విజయ్ దేవరకొండ చేసే ఛాన్స్ ఉన్నా ఉంటుందని అప్పుడే వార్తలు మొదలుపెట్టారు. ఏమో మనం అనుకుంటున్నట్టే జరిగినా జరగొచ్చు.. అల హిట్ తో సుశాంత్ కూడా మంచి ఫామ్ లోకి వచ్చేశాడు కదా ఏమైనా జరగొచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి: