బాల‌కృష్ణ బోయ‌పాటి చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం త్వ‌ర‌గా పూర్తి చెయ్యాల‌నే ప‌నిలో ఉన్నారు బాల‌య్య‌. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ దొర‌క‌క ఒక ఇబ్బంది అయితే. బాల‌య్యకు హీరోయిన్ వెత‌క‌డం బోయ‌పాటికి పెద్ద‌ప‌నిగా మారింద‌ట‌. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం చాలా క‌ష్టంగా మారింది. చిరంజీవి, వెంక‌టేష్‌, నాగార్జున వీళ్ళ ప‌రిస్థితి కూడా దాదాపు అదే. అందులో బాల‌య్య‌బాబు ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణంగా ఉంది. ఎప్పుడూ న‌టించే హీరోయిన్‌నే మ‌ళ్ళీ మ‌ళ్ళీ రిపీట్ చేస్తున్నాడు బాల‌య్య‌.

 

టాలీవుడ్‌లో బాల‌య్య మార్కెట్ కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. ఈ మ‌ధ్య కాలంలో బాల‌య్య చిత్రాలేమీ కూడా పెద్ద‌గా హిట్ కావ‌డం లేదు. ఇటీవ‌లె విడుద‌లైన కె.ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రూల‌ర్‌`చిత్రం ఆశించినంత హిట్ కాక‌పోగా. ఆ చిత్రంలో బాల‌కృష్ణ గెట‌ప్ మీద ర‌క ర‌కాల కామెంట్లు వ‌చ్చాయి. ఇక ఆయ‌న విగ్ మీద అయితే విప‌రీత‌మైన ట్రోల్ జ‌రిగింది. కానీ ఏమాట‌కామాటే చెప్పాలంటే బాల‌కృష్ణ ఈ సినిమాలో డ్యాన్స్ అద‌ర‌గొట్టాడ‌నే చెప్పాలి. క‌థ  ప‌రంగా ఎలా ఉన్నా బాల‌య్య పెర్‌ఫార్మెన్స్ మాత్రం అదుర్స్ డాన్స్‌, ఫైట్స్ అన్నీ కొత్త త‌ర‌హాలో చేశాడు. కానీ ప్రేక్ష‌కులు బాల‌కృష్ణ ఏంచేసినా కూడా ఒక కామెడీ కింద తీసేస్తున్నారు. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ఆయ‌నకు మార్కెట్ లేక‌పోవ‌డంతో సినిమాలు ఏవీ హిట్ కావ‌డం లేదు.

 

దీంతో ఇంక బాల‌య్య సైలెంట్ అయితే బెట‌ర్ అని కొంద‌రు భావిస్తున్నారు. అయితే ఇటీవ‌లె తెలిసిన స‌మాచారం ప్ర‌కారం బాల‌య్య హీరోగా సైలెంట్ అయి విల‌న్‌గా కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్న‌ట్లు టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న గుండు గెట‌ప్ కూడా అందుకోస‌మేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే బాల‌కృష్ణ బోయ‌పాటి చిత్రం కాక మ‌రో చిత్రానికి కూడా సైన్ చేశారు. అందులో విల‌న్ పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి ఇప్ప‌టికే స్టైలిష్ విల‌న్‌గా ఒక‌ప్ప‌టి హీరో జ‌గ‌ప‌తిబాబు కెరియ‌ర్‌ని కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయ‌నకు చెక్ పెట్ట‌డానికే బాల‌య్య వ‌స్తున్నాడా అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: