టాలీవుడ్‌లో ఎంద‌రో ద‌ర్శ‌కులుగా, నిర్మాత‌లుగా ఎంతో పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. ఆయ‌న తీసిన కొన్ని చిత్రాలు ఇప్ప‌టికి కొన్ని ఆక‌ర్షించి ఆలోచించే విధంగా ఉంటాయంటే అది స‌త్య‌మ‌నే చెప్పాలి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేసి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకున్నారు. కోవెల‌పూడి రాఘ‌వేంద్ర‌రావు ఈయ‌న‌ను ఇండ‌స్ట్రీ వాళ్ళు ద‌ర్శ‌కేంద్రుడు అని పిలుస్తారు. ఎంతో మంది క‌థానాయ‌కులతో ఎన్నో చిత్రాల‌ను తీశారు. స్త్రీ పాత్ర‌ల‌నే ప్ర‌ధానంగా తీసిన కొన్ని చిత్రాలు ఆయ‌న‌కంటూ మైలురాళ్ళ‌ని చెప్పాలి.

 

ఇండ‌స్ట్రీలో ఆయ‌న తీసిన సినిమాలు కొత్త‌పుంత‌లు తొక్కాయ‌నే చెప్పాలి. తెలుగు సినిమా చిత్ర ప్ర‌వేశం ఆయ‌న 1978లో ప్ర‌వేశించారు. బాబు సినిమాతో ఆయ‌న శోభ‌న్‌బాబు చిత్రాన్ని ప‌రిచ‌యం చేశారు. త‌ర్వాత జ‌య‌సుధ ప్ర‌ధాన పాత్ర‌లో జ్యోతి సినిమాను తెర‌కెక్కించారు. 1978లో ఆయ‌న పేరు మారుమ్రోగింది. రెండు సినిమాల‌కు మంచి పేరు వ‌చ్చింది. ఎన్టీఆర్‌తో ఆడ‌విరాముడు సినిమా తీసి మంచి హిట్ సాధించారు. త‌ర్వాత శ్రీ‌దేవి క‌థానాయిక‌గా ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు చిత్రం తీశారు. అప్ప‌ట్లో ఎన్టీఆర్‌, రాఘ‌వేంద్ర‌రావ్ చిత్ర‌మంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఉండేది.  ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి జితేంద్ర‌తో హిమ్మ‌త్‌వాలా, దోఫా చిత్రాలు తీసి అక్క‌డ కూడా రెండు హిట్లు సాధించారు రాఘవేంద్ర‌రావు.

 

జ‌గ‌దీక‌వీరుడు అతిలోక‌సుంద‌రి చిత్రం చిరంజీవి ఆల్‌టైమ్ హిట్ గా చిరంజీవి టాప్‌టెన్ చిత్రాల్లో ఉండడం గ‌మ‌నార్హం అని చెప్పాలి. అలాగే భ‌క్తిర‌స చిత్రాల‌ను కూడా ఆయ‌న‌కు మించి మ‌రే ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించ‌లేర‌నే చెప్పాలి. ఇక ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించే చిత్రాలు ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. మ‌రే ద‌ర్శ‌కుడు ఆయ‌న‌కు సాటి రాలేర‌నే చెప్పాలి. అన్న‌మ‌య్య చిత్రంతో అక్కినేని నాగార్జున‌లో ఆయ‌న కొత్త కోణాన్ని చూపించారు. నాగార్జున‌కి ఆల్‌టైమ్ హిట్ గా ఆయ‌న కెరియ‌ర్‌లో టాప్ టెన్ చిత్రాల్లో నిలిచింది అంటే దాని క్రెడిట్ మొత్తం రాఘ‌వేంద్ర‌రావు అని ఆయ‌న అంటారు. ఇక ఇప్ప‌టికీ ఆయ‌న కుమారుడు కోవెల మూడి ప్ర‌కాష్‌తో కూడా ఆయ‌న సినిమాల‌ను అందిస్తున్నారు. అలాగే రాఘ‌వేంద్ర‌రావుతో ఏ నిర్మాత‌కి ఏ ద‌ర్శ‌కుడికి, ఏ న‌టుడికి లేవంటే ఇది ఒక గొప్ప కీర్తి అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: