క్రేజీ డైరెక్ట‌ర్ పూరి గురించి తెలియ‌ని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఈయ‌న సినిమాల కుండే క్రేజ్ మాములు కాద‌నే చెప్పాలి. ఒక‌ప్పుడు పూరి బ్యాన‌ర్‌లో సినిమా అంటే చాలు యూత్ మొత్తం థియేట‌ర్లో నిండిపోయేవారు. హీరోలు, హీరోయిన్లు డైరెక్ట్‌గా కొత్త‌త‌ర‌హాలో తిట్టుకోవ‌డం బోల్డ్‌గా మాట్లాడుకోవ‌డం అన్న కాన్సెప్ట్ పూరి సినిమాల‌తోనే మొద‌ల‌య్యాయి. ఆయ‌నకున్న డేర్ మ‌రే డైరెక్ట‌ర్‌కి లేద‌నే చెప్పాలి. పూరి అంటే చాలు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్ట‌ర్ అంటారు. హీరోయిన్ల‌ను బోల్డ్‌గా చూపించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి అని చెప్పాలి. అలాగే హీరో హీరోయిన్స్ రొమాన్స్ చూపించాలంటే ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అని అంటారు. ఎంతో మంది అగ్ర‌క‌థానాయ‌కుల‌తో సినిమాలు తీసి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు పూరిజ‌గ‌న్నాధ్‌.

 

హీరోయిన్ల అంద‌చందాల‌ను చూపించ‌డంలో ఆయ‌న‌కు ఒక ప్ర‌త్యేక‌మైన స్టైల్ ఉంది. ర‌వితేజ కెరియ‌ర్ నిల‌బెట్టింది పూరిజ‌గ‌న్నాధ్ అని చెప్పాలి. ఇడియ‌ట్ చిత్రంతో ఆయ‌న కెరియ‌ర్ మ‌లుపు తిరిగింది. త‌ర్వాత అమ్మానాన్న త‌మిళ‌మ్మాయి ఇలా కొన్ని చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక ఈయ‌న చిత్రంలో హీరో హీరోయిన్లు మాట్లాడుకునే ప‌ద్ధ‌తి చాలా కొత్త‌గా అనిపిస్తుంది. ర‌క్షిత‌, ర‌వితేజ న‌టించిన ఇడియ‌ట్ చిత్రంలో అప్ప‌ట్లో క‌మీష‌న‌ర్ కూతుళ్ళ‌కి మొగుళ్ళురారా..అన్న డైలాగ్ అలాగే పోకిరిలో మ‌హేష్ హీరోయిన్‌తో చెప్పే డైలాగులు ఉప్మా తిని ఫ్యామిలీ ఫ్యామిలీ బ్ర‌తికేస్తున్నా ఇంకా ఆ సినిమాలో చెప్పాలంటే ఇలాంటివి చాలా డైలాగ్స్ అదుర్స్ అని చెప్పాలి.

 


 ఒక సినిమా పూర్త‌వ‌గానే మ‌రో సినిమాకి డైలాగులు రాయ‌డానికి ఆయ‌న గోవా వెళిపోతార‌ట‌. అక్క‌డ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కూర్చుని రాస్తార‌ని స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే ఏ ద‌ర్శ‌కుడికైనా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా స‌హ‌జం ఆయ‌నకు పెద్ద‌గా ఆ మ‌ధ్య చిత్రాలు లేవు. తీసిన ప్ర‌తి చిత్రం ఫ్లాప్ అయింది. మ‌ళ్ళీ చాలా గ్యాప్ త‌ర్వాత బాల‌కృష్ణ తో తీసిన పైసావ‌సూల్ ఇటీవ‌లె హీరో రామ్‌తో తీసిన ఇస్మార్ట్ శంక‌ర్ మంచి హిట్లు ఇచ్చాయ‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఆయ‌న విజ‌య్‌దేవ‌ర‌కొంతో ఫైట‌ర్ అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. అలాగే సినిమాని చాలా త్వ‌ర‌గా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో పూరి ఫ‌స్ట్ ప్లేస్ అని చెప్పాలి. అంత త్వ‌ర‌గా ఆయ‌న తీసేస్తార‌ట‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: