సాధారణంగా సినిమా రిలీజయ్యాక రివ్యూలివ్వడం ఒకప్పుడు ఉండేది. అయితే ఇప్పుడు కొన్ని వెబ్ సైట్స్ లో 24 గంటలకి ముందుగానే అంటే సినిమా రిలీజ్ కి ముందే సినిమా ఎలా ఉందో రాసేస్తున్నారు. అయితే ఇదెలా సాధ్యమని మేకర్స్ చాలా మంది తల బద్దలు కొట్టుకుంటున్నారు. గట్టిగా రెండు షోలు పడకముందే సినిమా ఫ్లాప్ అని యావరేజ్ అని, హిట్ అని ఎలా చెబుతున్నారు. రివ్యూస్ లో సినిమాకి రేటింగ్ ఎలా ఇస్తున్నారు అన్న అనుమానాలు బాగా ఉంటున్నాయి. అంతేకాదు కొన్ని సార్లు ఇంటర్వ్యూస్ లో సినిమా గురించి అడిగితే షాకయ్యి ఆ సమయానికి సర్దుకున్నా తర్వాత ఇంటర్వ్యూ చేసిన వాళ్ళని ఏకిపారేస్తారు.

 

ఇలాంటి అనుభవమే సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఎదురైందట. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా పటాస్. ఆ సినిమా టైమ్ లో చెత్త సినిమా అంటూ మీడియా వాళ్ళు నెగిటివ్ రివ్యూస్ అండ్ రేటింగ్ ఇచ్చారట. పటాస్ విడుదలకు ముందే ప్రివ్యూ చూసి .. ఎలాంటి ఎలివేషన్స్ లేని.. హీరోయిజం లేని చెత్త చిత్రం అని తిట్టేశారట. అయితే అదే సినిమాని పంపిణీదారుడు అయిన దిల్ రాజుకు ప్రదర్శించాక.. రెస్పాన్స్ వేరేగా ఉంది. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలుస్తుందని అన్నారట. ఈ విషయాన్ని రావిపూడి రకరకాల సందర్భాల్లో మీడియాతో చెప్పాడు.

 

మా జీవితం .. వృత్తి కంటే మీకు డబ్బు ముఖ్యమా .. అంటూ మీడియాని ప్రశ్నించారు రావిపూడి. మొత్తానికి తన ఆవేదనని ఇన్నాళ్ళకి బయట పెట్టాడు. సంక్రాంతికి రిలీజై  సరిలేరు నీకెవ్వరు సినిమాను కూడా మీడియా వాళ్ళు ఇష్టమొచ్చినట్టు విమర్శించారు. సినిమాలో మహేష్ బాబు కి సరిపడే కథ కథనం లేదని కొందరు విమర్శించారు. అందుకు అనీల్ బాగా హర్ట్ అయ్యాడు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా అనిల్ రావిపూడి మీడియాని ఏకేస్తున్నాడు. అయితే ఈ దర్శకుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. ఆయన సినిమాలని బాగా ప్రమోట్ చేసింది కూడా మీడియానే అని తెలుసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: