శ్రీ‌నువైట్ల  ఎన్నో హిట్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నీకోసం, ఆనందం, సొంతం, ఢీ లాంటి చిత్రాల‌కు హిట్లు అందుకుని వ‌రుస‌గా చిరంజీవి, మ‌హేష్‌బాబు, నాగార్జున‌, వెంక‌టేష్, ర‌వితేజ‌ లాంటి అగ్ర‌క‌ధానాయ‌కుల‌తో సినిమాలు తీసి విజ‌యం సాధించారు. ఇక క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కి కామెడి జోడించి మెప్పించిన శ్రీ‌నువైట్ల‌కి కొన్నాళ్ళుగా స‌రైన స‌క్సెస్‌లు రావ‌డం లేదు. మ‌హేష్‌బాబు ఆగ‌డు చిత్రం నుంచి ర‌వితేజమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రాల వ‌ర‌కు అన్నీ ఫ్లాపులుగానే మిగిలిపోయాయి. శ్రీ‌నువైట్ల తూర్పుగోదావ‌రి జిల్ల‌లో పెద్ద ఉమ్మ‌డి కుటుంబంలో జ‌న్మించారు. తండ్రి వ్య‌వ‌సాయం చేసేవారు. త‌ల్లి గృహిణి. శ్రీ‌ను ఇంట‌ర్ చ‌దివే స‌మయంలో కాలేజ్ ఎగొట్టి మ‌రి సినిమాలు చూసేవార‌ట‌.

 

ఆయ‌న‌కు మ‌ణిర‌త్నం అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. శ్రీ‌నువైట‌ర్ల రూపా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆత‌ర్వాత భ‌ర్త మాన‌సికంగా వేధిస్తున్నారంటూ శ్రీ‌ను మీద కంప్లైంట్ ఇచ్చింది. ఆ త‌ర్వా త ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు పోయి ప్ర‌స్తుతం ముగ్గురు పిల్ల‌ల‌తో హ్యాపీగా ఉంటున్నారు. ఇక శ్రీ‌నుకి అనుకోకుండా ఒక‌సారి మ‌ద్రాసులో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కృష్ణ‌వంశీ ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ మంచి మిత్ర‌లుగా మారి ఒకేరూమ్‌లో ఉన్నారు. మ‌ద్రాస్ వ‌చ్చిన ప‌దిహేను రోజుల‌కే చ‌ల‌సాని రామారావు ద‌గ్గ‌ర స‌హాయ ద‌ర్శ‌కునిగా కెరియ‌ర్‌ని మొద‌లుపెట్టారు శ్రీ‌ను. ప్రాణానికి ప్రాణం సినిమాకి ఆయ‌న స‌హాయ ద‌ర్శ‌కునిగా ప‌ని చేశారు.

 

అయితే ఆ సినిమా అప్ప‌ట్లో ఫ్లాప్ అయింది. త‌ర్వాత ఆయ‌న రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర ప‌ని చేద్దామ‌ని ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చి ఎంత‌గానో ట్రై చేశారు కానీ అవ‌కాశం రాలేదు. దీంతో సాగ‌ర్ అనే ద‌ర్శ‌కుని ద‌గ్గ‌ర సెటిల్ అయి న‌క్ష‌త్ర పోరాటం, అమ్మ‌దొంగ చిత్రాల‌కు స‌హాయ ద‌ర్శ‌కునిగా పని చేశారు. దీంతో సినిమాలు తియ్య‌డం పై పూర్తి అవ‌గాహ‌న ఏర్ప‌డింది. దీంతో తానే సినిమాలు తీయ‌డానికి క‌థ రాయ‌డం మొద‌లు పెట్టి ఒక సినిమా ప్రారంభించి మొద‌టి షెడ్యూల్ అవ్వ‌గానే హీరో నిర్మాత‌ల కార‌ణంగా ఆ సినిమా ఆగిపోయింది. ర‌వితేజ, మ‌హేశ్వ‌రి చిత్రం నీకోసం మంచిసూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుంది. అదే సంవ‌త్స‌రం ఈ చిత్రం 7 నంది అవార్డుల‌ను అందుకుంది. అంతేకాక శ్రీ‌ను కూడా ఒక నంది అవార్డుని అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: