దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య వంద దాటింది. దీంతో అనేక ప్రాంతాల్లో వైరస్ పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో తాజాగా కరోనా వైరస్ గురించి కూడా జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ ఆసక్తికర పోస్టు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ ఒక రేంజిలో వణికిస్తుంటే ప్రభుత్వం సమయంలో కొన్ని కష్టతరమిఅన్ నిర్ణయాలు తిసుకోవలసి వస్తుంది. అయితే ఇదే సమయంలో వారిపై ఒత్తిడి వల్ల వారు అన్నీ పనులు చేయలేకపోవచ్చు. ఇప్పుడు బుల్లితెర యాంకర్ మరియు నటి అయిన రష్మి ప్రభుత్వం వైరస్ ను అరికట్టేందుకు ఇన్ని చర్యలు తోసుకున్నా వారి పైన్ ఫైర్ అయింది.

 

కాగా వైరస్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చేపడుతోన్న కరోనా నియంత్రణ చర్యలపై జబర్దస్త్ యాంకర్ బుల్లితెర బ్యూటీ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ స్కానింగ్‌లు కేవలం ఇంటర్నేషనల్ ప్రయాణికులకేనా..? డొమెస్టిక్ ప్రయాణికులకు అవసరం లేదా..? అంటూ రష్మీ ఎయిర్‌పోర్ట్ అధికారులను ప్రశ్నించారు. దానికి స్పందించిన ఎయిర్ పోర్టు సిబ్బంది.. ”APHO ద్వారా స్క్రీనింగ్ జరుగుతుంది. అందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశీయ, విదేశీ టెర్మినల్స్ వద్ద కూడా పరిశుభ్రతకు సంబంధించి అవగాహన చర్యలు తీసుకున్నాంఅని తెలిపింది.

 

రాత్రి తాను ఎయిర్ పోర్టులో కేవలం సీఐఎస్ఎఫ్ సిబ్బంది మాత్రమే మాస్క్ ధరించి ఉన్న విషయాన్ని గుర్తించినట్లుగా తెలిపింది రష్మీ గౌతమ్. హ్యాండ్ శానిటైజర్ గురించి అడిగినప్పుడు కూడా అక్కడున్న సిబ్బంది వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయితే అందుకు తాను విమానాయన సంస్థల్ని, సిబ్బందిని నిందించడం లేదని పేర్కొంది రష్మీ.

మరింత సమాచారం తెలుసుకోండి: