తెలుగు సినీ పరిశ్రమలో పూరి జగన్నాథ్ ది ఒక ప్రత్యేక శైలి. ఆయన సినిమాలు అన్నీ కూడా ఒక జోనర్ లో ఉంటాయి. హీరో ఎవరు అనేది చూడకుండా సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. అగ్ర హీరోలు అందరితో దాదాపుగా సినిమాలు చేసిన పూరి... మంచి హిట్స్ కొట్టారు. పోకిరి, బద్రీ వంటి సినిమాలు ఆయన్ను టాప్ దర్శకుడ్ని చేసాయి. హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలకు ఆయన విజయాలను అందించారు. అతి తక్కువ కాలంలో అగ్ర దర్శకుడు అయ్యారు పూరి జగన్నాథ్. 

 

ఆయన కెరీర్ లో పోకిరి సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన మూడు నాలుగు సినిమాలు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక పూరి జగన్నాథ్ చేసిన కొన్ని సినిమాలు ఆయన క్రేజ్ బాగా పెంచాయి. ముఖ్యంగా హీరో పాత్ర అంటే రాష్ గా ఉండాలి, హీరోయిన్ కూడా అలాగే ఉండాలి, అవసరమైతే హీరోయిన్... హీరో మందు అమాయకంగా ఉండాలి అన్నట్టు ఆయన చూపించారు. పూరి సినిమా అంటే హీరో పాత్ర ఇలాగే ఉంటుంది అనే విధంగా ఆయన కొత్త ట్రెండ్ సృష్టించారు. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ లో ఆ యాంగిల్ చూసి టాలీవుడ్ షాక్ అయింది. 

 

అప్పటి వరకు ఎన్టీఆర్ అలాంటి పాత్ర ఎప్పుడూ చేయలేదు. ఎన్నో సినిమాల్లో ఆయన సాఫ్ట్ గానే కనిపించారు. హీరో తోనే సినిమా నడవాలి అనేది పూరి ఆలోచన. ఆ విధంగానే ఆయన సినిమాలను రూపొందిస్తూ ఉంటారు. హీరోలకు వారి పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆయన చాలా వివరంగా చెప్పి ఒప్పించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. దీనితో హీరోలు కూడా పెద్దగా ఇబ్బంది పడుతూ చేసినట్టు ఎక్కడా చెప్పలేదు. ఏది ఏమైనా ఆయన ఒక ట్రెండ్ సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: