ప్రభాస్ కు రాజకీయాలు తెలియవు అని అంటారు దీనికితోడు ప్రభాస్ ఏ రాజకీయ పార్టీతోను సన్నిహిత సంబంధాలు కొనసాగించడు. అయితే ప్రభాస్ లేటెస్ట్ గా ప్రస్తుతం తాను షూటింగ్ చేస్తున్న కరోనా ప్రాంతం అయిన యూరప్ లోని జార్జియా నుండి తన అభిమానులకు ఇచ్చిన పిలుపు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

 

కరోనా సమస్యతో ఫిలిం చాంబర్ అదేవిధంగా మా సంస్థ సినిమాల షూటింగ్ లను ఎక్కడికక్కడ ఆపుచేసి వెంటనే హైదరాబాద్ తిరిగి రమ్మని స్పష్టమైన సందేశాలు ఇచ్చారు. దీనితో సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అంతేకాదు విదేశాలలో షూటింగ్ లో ఉన్న నటీనటులను కూడ తమ షూటింగ్స్ ఆపుచేసుకుని వెంటనే భాగ్యనగరం తిరిగి రమ్మని మా సంస్థ పిలుపు ఇచ్చింది.

 

ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ లో ఉన్న ప్రభాస్ తన షూటింగ్ ను ఆపు చేసుకుని తన యూనిట్ తో సహా తిరిగి వస్తాడా అంటూ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సున్నితమైన విషయానికి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా ప్రభాస్ తన అభిమానులకు జార్జియా నుండి అభిమానులకు పిలుపును ఇచ్చాడు.


కరోనా తో ప్రపంచం యుద్ధం చేస్తోందని ఈ యుద్ధంలో తన అభిమానులు కూడ జాగ్రత్తగా ఉండాలని పిలుపు ఇచ్చాడు. అంతేకాదు జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరికి  వారు రక్షణ వలయంలో ఉండాలని వీలైనంత వరకు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ జనం మధ్య తిరగకుండా తన అభిమానులు అంతా ఈ కరోనా వైరస్ ముప్పున పడకుండా జాగ్రత్తలు తీసుకోమని ప్రభాస్ పిలుపును ఇచ్చాడు. ప్రభాస్ సందేశం క్షణాలలో మీడియాతో పాటు అతడి అభిమానుల మధ్య కూడ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్న ప్రభాస్ తన అభిమానుల చేత కరోనా పై యుద్ధం చేయిస్తూ తాను మాత్రం ప్రస్తుతం ప్రపంచంలో కరోనా సమస్య విపరీతంగా ఉన్న ఇటలీ కి దగ్గరలో ఉన్న జార్జియా లో ప్రభాస్ ఇప్పటికీ ఎందుకు ఉంటున్నాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: