తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ దర్శకులకు కొదవ లేదు. హీరోలను మాస్ లుక్ లో చూపించడం, మాస్ కథలు రాసుకోవడం, మాస్ కథలకు కమర్షియల్ హంగులు అద్దడం మనవాళ్లకు ఉన్న టాలెంట్. అలాంటి టాలెంట్ ఉన్న వాళ్లు కథలు రాసుకుని ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తూంటారు. అలా ప్రయత్నాలు చేసి కథా రచయితగా ఎదిగిన వ్యక్తి కొరటాల శివ. అయితే.. ఏ వ్యక్తికైనా తన పేరు సినిమా టైటిల్స్ లో చూసుకోవాలనే కాంక్ష ఉంటుంది. కానీ.. ఈ విషయంలో కొరటాల శివకు ఎదురుదెబ్బలే తగిలాయి.

 

 

ఇది ఓపెన్ సీక్రెట్ అనే చెప్పాలి. కథా రచయిత నుంచి దర్శకుడిగా మారిన కొరటాల శివ వరుసగా నాలుగు సినిమాలు సూపర్ హిట్ చేసి సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ.. కొరటాల శివ గురించి ఈ మాత్రమే తెలిసినోళ్లకు ఆయన రాసిన కథల గురించి నామమాత్రంగా తెలుసు. కొరటాల మేనమామ ప్రముఖ రచయిత, దర్శకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళి ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేశారు. కొరటాల రాసిన కథలెన్నో సూపర్ హిట్టయ్యాయి. కొరటాల శివ పేరు టైటిల్స్ లో పడకుండా కొంతమంది ఆ కథలను తీసుకుని కూడా మోసం చేశారని పబ్లిక్ గానే వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై పెద్ద చర్చే జరిగింది.

 

 

మాస్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కొరటాల కథలను తీసుకుని తెరకెక్కించి టైటిల్స్ లో పేర్లు కూడా వేయలేదని కొరటాల కూడా చెప్పుకొచ్చాడు. తన కష్టం సినిమాలో పేరు రూపంలో కనిపిస్తుందనుకుంటే జరగలేదని అన్నాడు. ఇలాంటి మోసాలకు గురై, ఆవేదన, బాధలతోనే రచయితలు దర్శకులుగా మారిపోతున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. ఇప్పుడు కొరటాల పెద్ద దర్శకుడు. ప్రస్తుతం మెగాస్టార్ తో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: