తన సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశాడు ఈ దర్శకధీరుడు. దేశం గర్వించదగిన దర్శకుడిగా ఎదిగిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రయాణాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో మొదలుపెట్టారు. తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి మెచ్చిన, నచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే ఠక్కున్న గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్. 

 

 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఎస్.ఎస్.రాజమౌళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘స్టూడెంట్ నెం.1’. ఎన్టీఆర్‌కు నటుడిగా గుర్తింపు తెచ్చింది కూడా ఈ సినిమానే. ఆ తర్వాతి సినిమా సింహాద్రి కూడా ఎన్టీఆర్‌తోనే. ఈ రెండు సినిమాలు కూడా హిట్. ఇక, వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన యమదొంగ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించింది.

 

 

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్, యాక్షన్ అల్టిమేట్. నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. వెరసి కంప్లీట్ హీరో బయటికి వచ్చాడు. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వీళ్లు మళ్లీ కలిశారు. రాజమౌళికి అందరు హీరోల్లో ఎన్టీఆర్ ఎప్పటికీ ప్రత్యేకం. అతడ్ని తారక్ అని ముద్దుగా పిలుస్తాడు. తారక్ కూడా జక్కన్న అని అంటాడు. వీళ్లు హీరో, డైరెక్టర్ అన్నట్లు మెలగరు. స్నేహితుల మాదిరి, అంతకుమించిన బంధం తమ మధ్య ఉన్నట్లు వ్యవహరిస్తుంటారు. 

 

 

తారక్ అంటే రాజమౌళికి ఎందుకంత ఇష్టం? అంటే.. రాజమౌళి, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఉత్సుకతతో సమాధానం ఇస్తుంటారు. ఒక షాట్‌లో 100 శాతం రిజల్ట్ కోరుకునే రాజమౌళికి ఎన్టీఆర్ అంతకుమించిన ఫలితాన్ని ఇస్తుంటాడని, ప్రతీ సీన్‌లో ప్రాణం పెట్టి నటిస్తుంటాడన్నారు. అందుకే జక్కన్నకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెబుతుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాలు వస్తే అభిమానులకు పండగే. వీరిద్దరి కంబినేషన్ లో ఈ సినిమా వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర చరిత్ర సృష్టించాల్సిందే. వీరిద్దరి కంబినేషన్లో మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ఈ సినిమా కోసం అభిమానాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: