విలక్షణ నటుడు మోహన్ బాబు ఆవేశాన్ని మాత్రమే కాకుండా ఆయన ఆశయాలను కూడ ఆచరిస్తూ మంచు మనోజ్ ఈమధ్య ఒక స్వచ్చంద సేవా సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా మంచు మనోజ్ వైఎస్ఆర్ పార్టీలో చేరతాడు అంటూ వార్తలు వచ్చాయి. 


మూడు సంవత్సరాల గ్యాప్ తరువాత ఈమధ్యనే తన లేటెస్ట్ మూవీ ‘అహం బ్రహ్మోస్మీ’ మొదలుపెట్టిన విష్ణు తన సినిమా రీ ఎంట్రీ కార్యక్రమాలు చూసుకుంటూనే ప్రస్తుతం తెలుగు ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ గురించి స్లమ్ ఏరియాలలో ప్రజలకు అవగాహన కలిగించడానికి సానటైజర్స్ మాస్క్ లు పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెడుతున్నట్లు ఆ వార్తను తన అభిమానులకు షేర్ చేసాడు. 


ప్రస్తుతం టాప్ హీరోలు అంతా కరోనా భయంతో తమ ఇంటికి పరిమితం అయి మీడియా ద్వారా సందేశాలు ఇస్తుంటే మంచు మనోజ్ మాత్రం దీనికి భిన్నంగా జనంలోకి ముఖ్యంగా స్లమ్ ఎరియాలలోకి వెళుతూ తన సామాజిక చైతన్యాన్ని ఈ విధంగా కనపరుస్తూ ఉన్న విధానం పై ప్రస్తుతం మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. రామ్ చరణ్ జూనియర్ లు కరోనా వైరస్ గురించి జాగ్రత్తలు చెపుతూ కేవలం ఒక వీడియోతో సరిపెట్టారు. 


ప్రభాస్ జార్జియా నుండి ఒక చిన్న మెసేజ్ పెట్టి తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ లను ఆపు చేయమని పిలుపును ఇచ్చి తన ఇంటికే పరిమితం అయ్యాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్నా ఈ సమస్య పై అవగాహన కలిగించడానికి స్లమ్ ఏరియాలకు వెళ్ళే సాహసం చేయలేకపోయాడు. ఇలా టాప్ హీరోలు అందరు కేవలం సందేశాలు ఇచ్చి ఇప్పుడు కరోనా వాళ్ళ షూటింగ్స్ క్యాన్సిల్ కావడంతో తాము త్వరలో నటించబోయే కథలు వింటూ ఈ గ్యాప్ నుస్ద్వినియోగ పరుచుకుంటున్నాడు వీరందరి తీరుకు భిన్నంగా మంచు మనోజ్ వ్యవహరిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడనుకోవాలి..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: