బాలకృష్ణ కు ఆవేశం చాలఎక్కువ దానితోపాటు అందరు వెళ్ళే దారిలో కాకుండా తన ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తూ తన వ్యక్తిత్వాన్ని బాలయ్య కొనసాగిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కున్న బోయపాటి బాలయ్యల మూవీ సెకండ్ షెడ్యూల్ కు అంతా రెడీ అయిన పరిస్థితులలో కరోనా సమస్యతో ఫిలిం ఛాంబర్ మా సంస్థల పిలుపు మేరకు షూటింగ్ లు బంద్ చేసిన విషయం తెలిసిందే. 


ఈ నిర్ణయంలో భాగంగా బాలయ్య బోయపాటిల మూవీ షూటింగ్ కూడ ఆగిపోయింది. అయితే ఈ విషయంలో బాలయ్య ఆలోచనలు వేరుగా ఉండటంతో తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్య బోయపాటిని పిలిచి ఈ మూవీ షూటింగ్ ఆపు చేయవద్దని కరోనా సమస్యలు లేని దేశంలోని మిగతా రాష్ట్రాలలో కాని లేదంటే కరోనా సమస్య అంతగా కనిపించని మరొక దేశంలో కాని ఈ మూవీ షూటింగ్ ను కొనసాగించమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.  


అయితే బోయపాటికి మాత్రం బాలయ్య చేసిన సూచన ఏమాత్రం నచ్చలేదు అని అంటున్నారు. ఇండస్ట్రీలోని అన్ని వర్గాలు ఫిలిం చాంబర్ నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ షూటింగ్ లను నిలుపు చేసిన పరిస్థితులలో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వేరే చోట షూటింగ్ చేయడం శ్రేయస్కరం కాదు అని బోయపాటి భావిస్తున్నట్లు టాక్. 


దీనికితోడు చిరంజీవి ఇచ్చిన పిలుపు మేరకు ఫిలిం చాంబర్ మా సంస్థలు తమ సంఘీభావాన్ని తెలియ చేస్తే ఇప్పుడు తన షూటింగ్ ను కొనసాగిస్తే మెగా కాంపౌండ్ ఆగ్రహానికి గురి అవుతాను అన్నభయం కూడ బోయపాటికి ఉన్నట్లు టాక్. ఇప్పటికే బోయపాటి కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితులలో బాలకృష్ణ ఆవేశంగా ఇచ్చిన సలహాతో బోయపాటి ఇలాంటి సాహసం చేయకపోవచ్చు అన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బాలయ్యకు చిరంజీవికి బయటపడని గ్యాప్ ఉన్న పరిస్థితులలో బాలకృష్ణ బోయపాటికి ఇచ్చిన సలహా నిజం అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: