టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఆర్య సినిమా ని ఎంత గొప్పగా తెరకెక్కించారో మాటల్లో వర్ణించలేం. ఫీల్ మై లవ్, నా ప్రేమను కోపంగాను అంటూ అల్లు అర్జున్, సుకుమార్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక సుఖభ్రాంతి ప్రసాదించారు. ఆర్య సినిమా ద్వారా ప్రేమకు ఒక నిర్వచనం చెప్పిన సుకుమార్ ఆ తర్వాత హీరో రామ్ పోతినేని నటించిన జగడం సినిమాలో మంచి యాక్షన్ చాలా చక్కగా చూపించారు.




వాస్తవానికి ప్రతి ఒక్కరికీ కోపం, ప్రేమ, ద్వేషం, అసూయ లాంటివి ఉంటాయి. కానీ సినిమాల్లో ఒక హీరోకి అటువంటి గుణాలు ఉన్నట్టు సుకుమార్ ని మినహాయించి ఏ దర్శకుడు చూపించడు... చూపించలేడు కూడా. ఆర్య 2 సినిమాలో హీరో క్యారెక్టర్ లో రెండు చెడ్డ గుణాలు ఉంటాయని చాలా మంది అంటుంటారు. కానీ సుకుమార్ రెగ్యులర్ ఫిలిం లాగా కాకుండా ఆర్య 2 లో స్వచ్ఛమైన ప్రేమను తెలియజేసి నిజమైన ప్రేమ అంటే ఏంటో గట్టిగానే చెప్పారు. ఆ తర్వాత 100% లవ్ సినిమాలో ప్రేమ కి ఎంత గౌరవం ఇవ్వాలో చాలా సింపుల్ గా చూపించేసారు.




సుకుమార్ తెరకెక్కించిన కుమారి 21F ఫ్రెంచ్ మూవీ 'Lila Says' నుండి కార్బన్ కాపీ అని తెలిసిన విషయమే. ఐతే ఈ సినిమాకి కాస్త మన నేటివిటీని కలిపి ఉన్నది ఉన్నట్టు సుకుమార్ చూపించిన అతను ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. ఏదైనా ఒక మంచి కథని తెలుగులో చక్కగా చూపించే మరికొంతమందిని అలరించారు సుకుమార్.




ఆ తర్వాత మహేష్ బాబు తో వన్ నేనొక్కడినే సినిమాని తెరకెక్కించి తెలుగు సినీ అభిమానులను మరొక లోకానికి తీసుకెళ్ళారు. నాన్నకు ప్రేమతో అనే లాజికల్ మైండ్ గేమ్ సినిమాని తెరకెక్కించి అతనిలో ఎంత క్రియేటివిటీ ఉందో ప్రజలకు తెలియజేశారు. ఇకపోతే రామ్ చరణ్ తో రంగస్థలం సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీలో ఒక పెద్ద చరిత్ర సృష్టించారు సుకుమార్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి థియేటర్ల నుంచి వచ్చేప్పుడు గర్వంగా 'ఒక మంచి సినిమా చూశాం,రా!' అనే ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. ఇటువంటి కొండంత క్రియేటివిటీ ఉన్న ఇంటెలిజెంట్ డైరెక్టర్ కుమార్ మరెన్నో ప్రయోగాత్మక సినిమాలు తీయాలని, మన తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: