టాలీవుడ్ లో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ సంచలన విజయాలను నమోదు చేశాడు ఆ దర్శకుడు. దర్శకుడిగా మారడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. దర్శకుడిగా మారిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మరెన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో ఎత్తుపల్లాలు చవి చూసాడు... ఎన్నో సంచలన విజయాలు అందుకున్నాడు... ఎంతోమంది స్టార్ హీరోలకు మంచి విజయాలు అందించాడు. కానీ ప్రస్తుతం హీరోగా మారిపోయాడు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా వి.వి.వినాయక్. వివి v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సాగర్ అనే దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వి వి వినాయక్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఆది సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

 

 

 అయితే ఫ్యాక్షన్ మేనియా లో దూసుకుపోతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో ఆది సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. మాస్ ప్రేక్షకులందరినీ అలరించే ఉర్రూతలూగించింది ఆది సినిమా. ఇక అటు ఎన్టీఆర్ కు  కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత తెరకెక్కించిన దిల్ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే. ఇక ఈ సినిమాను నిర్మించిన రాజు.. దిల్ రాజు గా మారిపోయి ప్రస్తుతం స్టార్  నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నాడు. ఈ సినిమా వి.వి.వినాయక్ కు మంచి విజయం సాధించి పెట్టింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో  ఠాగూర్ సినిమా తెరకెక్కించాడు వివి వినాయక్. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో  సంచలన విజయాన్ని అందుకొని ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. దీంతో వి.వి.వినాయక్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు. 

 

 

 ఇక ఆ తర్వాత వరుస ఫ్లాపులు చవిచూసిన వి.వి.వినాయక్ తెర మీద ఎక్కువగా కనిపించలేదు. ఇక ఆ తర్వాత చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150 మరోసారి తెర మీదికి వచ్చి చిరంజీవి తో సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఎక్కడ వినాయక్  ఊసేలేదు. కానీ కొంత గ్యాప్ తర్వాత వి.వి.వినాయక్ ఏకంగా హీరోగా అవతారం ఎత్తాడు. దర్శకుడిగా నిలదొక్కుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డా వినాయక్... ఏకంగా  జిమ్ కు  వెళ్లి కండలు పెంచి హీరోగా అవతారమెత్తాడు. సీనయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ . కథ నచ్చడంతో ద్వారానే ఈ సినిమా చేస్తున్నాను అని చెబుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: