ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పటి వరకు 5 వేలకు పైగా ప్రాణాలు బలికొన్నది.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ వైరస్ 145 దేశాలకు విస్తరించింది. ప్రపంచాన్ని ఇప్పుడు కరోనా మహమ్మారి పట్టి పీడిస్తుంది.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు. ఈ వైరస్ అక్కడ కాస్త అదుపులోకి వచ్చినా యూరప్ దేశాలకు బాగా విస్తరించి భయపెడుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి చెప్పింది.   ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1,45,631 మందికి చేరింది. ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్ లో కరోనా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.  ఇరాన్లో 514 మంది, స్పెయిన్లో 133 మంది చనిపోయారు. ఇటీలీ వెయ్యి మందికి పైగా మరణాలు సంబవించాయి.   

 

దక్షిణ కొరియాలో 75 మంది, అమెరికాలో 68 మంది, యూకేలో 35 మంది, జపాన్ లో 24 మంది, నెదర్లాండ్స్ లో 20 మంది మృత్యువాత పడ్డారని పేర్కొంది. చైనాలో మృతుల సంఖ్య 3,213కు చేరిందని చెబుతున్నారు.  ఇక దేశ వ్యాప్తంగా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రులకు వస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  భారత్ లో ఇప్పటికే 80 మందికి పైగా కరోనా సోకినట్లు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో ఇది వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయనే భయాందోళనలు సర్వత్ర నెలకొన్నాయి. తాజాగా బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ కరోనా భయాల నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మాద్యం ద్వారా ఆయన తెలియజేశారు.

 

ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా ఆయన ఎంతో గొప్ప పేరు సంపాదించారు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా దిలీప్ కుమార్ కి మంచి పేరు ఉంది.  కరోనా సోకకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగానే స్వీయ నిర్బంధాన్ని విధించుకున్నానని ఈ సందర్భంగా దిలీప్ కుమార్ తెలిపారు. అంతేకాదు తన సతీమణి సైరాబాను ఎలాంటి రిస్క్ ఉండకూడదనే ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: