టాలీవుడ్‌లో ఎంద‌రో డైరెక్ట‌ర్స్ ఉన్నారు.  కాని, ఎవరి స్టైల్ వారికి ఉంటుంది. ఒక‌రు పంచులు, ప్రాసలతో అద‌ర‌గొడితే.. మ‌రొకరు రఫ్ గా స్ట్రయిట్ ఫార్వడ్ గా అద‌ర‌గొడ‌తారు. ఇలా ఒకొకరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. అలా రవిబాబు అంటే మనకు గర్తొచ్చేది వైవిద్యత. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్న డైరెక్టర్ రవిబాబు. కామెడీ, లవ్, హర్రర్, సస్పెన్స్‌ ప్రాజెక్టులతో తన టాలెంట్‌ను ప్రువ్ చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయాడు రవిబాబు. సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంలో అయినా, మెగా ఫోన్ పట్టి సినిమా రూపొందించడంలో అయినా రవిబాబు రూటే సపరేటు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

నటుడు చలపతిరావు కుమారుడు అయినా రవిబాబు… స్వయంకృషితోనే పైకి వచ్చాడు. నటుడిగా సినీరంగ ప్రేవేశం చేసిన ఆయన ముందుగా ప్రతినాయకుడు పాత్రలోనే నటించి మెప్పించారు. తర్వాత అమెరికా వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొంది కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. నరేష్ ని పరిచయం చేస్తూ అతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం అల్లరి మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం తర్వాత నరేష్ పేరు అల్లరి నరేష్ గా స్థిరపడింది. తర్వాత అదే చిత్ర కోవలో తీసిన అమ్మాయిలు అబ్బాయిలు, సోగ్గాడు మరియు పార్టీ చిత్రాలు కూడా మంచిగానే హిట్ అయ్యాయి.

 

పార్టీ చిత్రం తర్వాత తన పంధా మార్చి సస్పెన్స్ మరియు హారర్ చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చిన‌ `అవును` సినిమా రావిబాబు కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అనిపించుకుంది. ఎందుకంటే.. అంత ఘన విజయం సాధించింది ఆ సినిమా. కెరీర్ ప్రారంభం నుంచే ఓ డిఫెరెంట్ అభిరుచి కలిగిన దర్శకుడిగా, మంచి టెక్నీషియన్‌గా గుర్తింపు పొందారాయన. ఇక ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గ‌త చిత్రం `ఆవిరి` పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో నెక్ట్స్ సినిమాతో హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడీయ‌న‌. ప్ర‌స్తుతం అదే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: