టాలీవుడ్ లోకి నూతనంగా అడుగు పెట్టబోతున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే మొదటి సినిమాలో హీరోయిన్ గా నటించే ఎవరయినా కాస్త పద్దతిగానే కనిపిస్తారు. గ్లామర్ పరంగా ఎక్స్ పోజింగ్ చేసే వాళ్ళు అంత ఎక్కువగా కనిపించరు. కానీ మొదటి సినిమాలోనే గ్లామర్ ని ఒలకబోస్తున్న భామల్లో కేతికా శర్మ చాలా ముందుగా ఉంది. కేతికా శర్మ ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

 


పూరి కనెక్ట్స్ బ్యానర్ లో పూరి జగన్నాథ్, చార్మి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. పూరి జగన్నాథ్ అందిస్తున్న కథతో వస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్, ఒక పాటని చూస్తుంటే ఈ సినిమాలో రొమాంటిక్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయనే అర్థం అవుతోంది. అంతే గాక హీరోయిన్ కేతిక శర్మ తన అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గలేదని క్లియర్ గా తెలుస్తుంది.

 


అయితే అందాల ఆరబోత వల్లనో, మరింకే కారణం వల్లనో ప్రస్తుతం కేతిక చేతిలోకి మరో సినిమా వచ్చింది. సంతోష జాగర్లపుడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో కేతిక హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇంకా మొదటి సినిమా కూడా రిలీజ్ కాకుండానే ఇలా రెండో సినిమా ఆఫర్ రావడం చాలా అరుదు. ఆ అరుదైన అవకాశం కేతికాకే వచ్చింది.

 

ఇదంతా రావడానికి కారణం ఆమె సోషల్ మీడియాలో పొందుతున్న అటెన్షనే కారణం అని కూడా అంటున్నారు. కేతిక శర్మ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు పెడ్తూ అందరి అటెన్షన్ తన మీదకే తెచ్చుకుంటుంది. ఈ రెండు చిత్రాల ఫలితం తెలిస్తే గానీ ఆమె కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం.

మరింత సమాచారం తెలుసుకోండి: