2001 సంవత్సరంలో జూనియర్ ఎన్టీయార్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టాడు రాజమౌళి. స్టూడెంట్ నంబర్ 1 నుండి బాహుబలి 2 వరకు రాజమౌళి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. ప్రతి స్టార్ హీరో తమ కెరీర్ లో ఒక్కసారైనా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఆశ పడతానడనటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించాలని ఆశపడే నటీనటులు ఎంతోమంది ఉన్నారు. 
 


రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా సక్సెస్ కావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రాజమౌళి ఒక సినిమా మొదలుపెట్టకముందే ఆ సినిమాకు సంబంధించిన కథ, కథనాలు అన్నీ ఫైనల్ చేసేస్తాడు. ప్రతి సన్నివేశంలోను ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమా మొదట్లో విలన్ ను హైలెట్ చేసే రాజమౌళి ఒకే ఒక్క సీన్ తో హీరో గ్రాఫ్ ను లేపి సక్సెస్ అందుకుంటాడు. రాజమౌళి సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా ఉంటాయి. 
 


రాజమౌళి సినిమాల్లో కొత్త కథ లేకపోయినా కథనంతో మ్యాజిక్ చేసేస్తాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఆయా హీరోల కెరీర్లో మరపురాని చిత్రాలుగా మిగిలాయి. బాలీవుడ్, ఇతర భాషల నుండి ఆఫర్లు వచ్చినా రాజమౌళి తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేస్తున్నాడు. 


 
ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీయార్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. 2020 జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా బాహుబలి 2 కలెక్షన్లను క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: