ఈ నటి అభిమానుల చేత మహానటిగా కీర్తించబడినది. చిన్ననాటి నుండి కూడా నటన అంటే ఆమెకి ప్రాణం. అయితే మొదట నాట్యం నేర్చుకుంది సావిత్రి. ఆ తర్వాత నాటకాలు వైపు వెళ్ళింది. ఆలా నాటకాల నుండి సినిమాల వైపు సావిత్రి సాగింది. ఆ తర్వాత ఆమె అనేక సినిమాలలో నటించి ఆఖరికి మహానటి అయ్యింది మన హీరోయిన్ సావిత్రి.పెద్దనాన్న సాయంతో సావిత్రి తన కెరీర్ అభివృద్ధి చేసుకుంది.

 

IHG

 

సావిత్రిని కేవలం సావిత్రి అని మాత్రమే కాకుండా మహానటి సావిత్రి, నడిగర్ తిలగం, సావిత్రి గణేష్ అని కూడా పిలుస్తారు. ఆమె కేవలం ఒక్క నటి మాత్రమే కాదు దర్శకురాలు కూడా. ఆమె ప్రతిభ అద్భుతం. చిన్నతనం నుండే నాట్యం లో దిట్టై అనేక ప్రశంసలు అందుకుంది నటి సావిత్రి. ఆమె చిన్న వయస్సు లోనే పృథ్వి రాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమతి అందుకుంది.

సావిత్రి అనేక కష్టాలని జీవితంలో ఎదుర్కొంది. ఎన్నో కష్టాలనోర్చి తిరుగులేని అభినేత్రిగా విరాజిల్లింది. మొదట వయసు లేదని సంసారం నుండి తొలగించబడినా పాతాళ భైరవి లో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసి చూడు సినిమాతో సావిత్రి జీవితం మలుపు తిరిగింది. అయితే కేవలం రెండో హీరోయిన్ గా మాత్రమే ఆగిపోవలసి వచ్చింది . కానీ దేవదాసు సినిమాలో సావిత్రి మరో విజయం అందుకుంది.

 

IHG

 

 

ఆ తర్వాత మిస్సమ్మ, మాయ బజార్, దొంగరాముడు, అర్ధాంగి, చరణదాసి వంటి ఎన్నో సినిమాలలో ఆమె నటించింది. అనేక సినిమాలు విజయం సాధించాయి. సావిత్రికి మంచి పేరు కూడా తెచ్చి పెట్టాయి. అయితే ఈమె కేవలం నటించడం మాత్రమే కాకుండా దర్శకత్వం కూడా వహించింది. 1968 సంవత్సరం లో చిన్నారి పాపలు సినిమాకి సావిత్రి దర్శకత్వం వహించింది. కానీ ఈ చిత్రం తార స్థాయికి చేరుకోలేదు. పెద్దగా విజయం అందుకోలేదు. కేవలం మహిళలు సినిమాని తీయడం విశేషం. ఆ తర్వాత మాతృ దేవోభవ వింత సంసారం మొదలైన సినిమాలకి దర్శకత్వం వహించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: