టాలీవుడ్ లో తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. అతని సినిమాలు అనగానే యూత్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అతని ఆలోచనా విధానానానికి ఎక్కువగా ప్రేక్షకులు ఉన్నారు. టాలీవుడ్ లో కొందరు హీరోలు కూడా విజయ్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అతనితో సినిమాలు చేయడానికి ఎక్కువగా దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ అనే గోల లేకుండా అతనితో సినిమాలు చేస్తున్నారు. ఇటీవల అతను నటించిన వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 

 

గీత గోవిందం సినిమా తర్వాత అతనికి ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంచి హిట్ రాలేదు. చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవ్వడంతో విజయ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా కూడా అతనికి ఊహించని షాక్ ఇచ్చింది. సినిమా గురించి నెగటివ్ ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇది అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది అనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు కొన్ని అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. అతనికి లవ్ స్టోరీస్ అసలు కలిసి రావడం లేదని, వాటిని పక్కన పెట్టి అతను సినిమాలు చేస్తే మంచిది అంటున్నారు పరిశీలకులు. 

 

ఇక అతను ఆ ఇమేజ్ నుంచి బయటకు రావాలని ఇది అంతగా కలిసి వచ్చే అవకాశం ఉండదు అంటున్నారు దర్శక నిర్మాతలు కూడా. ఇటీవల అతన్ని ఒక దర్శకుడు సంప్రదించగా తాను... లవ్ స్టోరీ అయితే చేస్తాను అని కథ ఎంత భిన్నంగా ఉన్నా సరే అందులో ప్రేమ కథ ఉండాలని అతను కోరుతున్నాడు. దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా అతనికి లవ్ స్టోరీస్ కలిసి రావడం లేదు అనే అభిప్రాయమే ఎక్కువగా ఇప్పుడు టాలీవుడ్ లో వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: