టాలీవుడ్ లో హిట్ పెయిర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీ, ప్రభాస్ అనుష్క. వీరి కాంబినేషన్ లో వచ్చిన నాలుగు సినిమాల్లో ఒక్క సినిమా మినహా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీనితో వీరి జోడి గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా ఇంతా కాదనే చెప్పాలి. ప్రతీ చిన్న విషయానికి వీళ్ళు ఇద్దరినీ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు వారి అభిమానులు. వీళ్ళు ఎక్కడైనా కలిసి కనపడటం ఆలస్యం పెళ్లి చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ఏదోక ప్రచారం చేస్తూ సందడి చేసుకుంటూ ఉంటారు. 

 

ఇటీవలి కాలంలో అనుష్క పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వస్తున్నాయి. క్రికెటర్ ని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని కొందరు, కాదు ఒక అగ్ర దర్శకుడి కుమారుడ్ని పెళ్లి చేసుకుంటుంది అని మరికొందరు ఇలా అన్ని విధాలుగా ఆమె పెళ్లి గురించి ఏదొక వార్త ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఆమె ప్రభాస్ గురించి కేవలం... తన పెళ్లిని వాయిదా వేసే ప్రయత్నం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీరు ఇద్దరూ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని కొందరు అంటే కాదు వీళ్ళకు పెళ్లి అయిపోయింది కాబట్టే ఇద్దరూ ఎవరికి చెప్పడం లేదని అంటున్నారు. 

 

అయితే ఇప్పుడు సోషల్ మీడియా వీరి మధ్య చిచ్చి పెడుతుంది అనే అభిప్రాయమే ఎక్కువగా వినపడుతుంది. సోషల్ మీడియా జనాలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీనితో ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాళ్ళు మంచి స్నేహితులు అని, ఎందుకు ఈ విధంగా చిచ్చుపెట్టడం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎన్నో సార్లు ఈ ప్రచారం తప్పని చెప్పినా సరే ఎవరు కూడా వినే ప్రయత్నం ఒక్క శాతం కూడా చేయకపోవడం ఆందోళన కలిగించే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: