టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి మినహా అందరికి ఉపయోగపడింది. చాలా మంది హీరోలు, హీరోలు హీరోయిన్ లు పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ని అన్ని విధాలుగా వాడుకున్నారు ఈ మధ్య కాలంలో యువ హీరోలు, కొత్త గా వచ్చే వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనడం ఆయన్ను సిఎం అనడం, ఆయన మంచి నాయకుడు అనడం ఇలా ఏ విధంగా చూసినా సరే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ ని వాడుకోవడం బాగా పెరిగింది అనేది అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. సోషల్ మీడియా లో పవన్ ఫాలోయింగ్ కొందరికి బాగానే ఉపయోగపడుతుంది అనే చెప్పవచ్చు. 

 

ఇప్పుడు ఇది పక్కన పెడితే, ముందు నుంచి పవన్ కళ్యాణ్ కి అభిమానిగా ఉన్న యువ హీరో నితిన్ కూడా అదే విధంగా అతని భజన చేస్తున్నాడు. ఇటీవల తన సినిమా భీష్మ ఒకటి విడుదల అయింది. దీని కోసం రష్మిక మందన తో భజన చేయించాడు అతను. ఆ భజన బాగానే హిట్ అయింది. అవసరం లేకుండా దానికి ఒక ప్రశ్న, దానికో సమాధానం ఇలా ఏదోక రూపంలో పవన్ కళ్యాణ్ పేరుని అన్ని విధాలుగా ప్రస్తావిస్తున్నారు. పవన్ ఫాలోయింగ్ పవన్ కంటే ఎక్కువగా ఇతర హీరోలకు ఉపయోగపడుతుంది. 

 

రష్మిక అయితే పదే పదే పవన్ పేరుని సినిమా ప్రమోషన్ లో వాడుకుంది. ఇప్పుడు రాబోయే సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ ని వాడుకునే విధంగా నితిన్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటుంది టాలీవుడ్. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు గాని నితిన్ మాత్రం అదే ఫాలో అవుతున్నాడు. దీనిపై ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయి. నితిన్ ప్రస్తుతం పెళ్లి హడావుడి లో ఉన్నాడు. ఆ తర్వాత సినిమాలలో కనిపించే అవకాశాలు కనపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: